Saturday, January 18, 2025
Homeసినిమాపవన్ రీమేక్.. రైటర్ గా మారిన డైరెక్టర్

పవన్ రీమేక్.. రైటర్ గా మారిన డైరెక్టర్

పవన్ కళ్యాణ్‌, హరీష్ శంకర్ కాంబినేషన్ లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.  ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటివరకూ ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. హరీష్ శంకర్ మాత్రం పవన్ తో సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నాడు. సాహో డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేస్తున్నట్టుగా ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రకటించారు కానీ.. హరీష్ శంకర్ తో మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో ఈ  మూవీ ఇక లేనట్టే అనే నిర్ణయానికి వచ్చారు సినీ జనాలు.

అయితే… పవన్ కళ్యాణ్‌.. హరీష్ శంకర్ ను ‘తెరి’ రీమేక్ చేద్దామని… ఆ కథను మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయమని చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి పవర్ స్టార్ అభిమానులు తెరి రీమేక్ వద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలవడం విశేషం. భవదీయుడు భగత్ సింగ్ మూవీని దాదాపు మూడేళ్ళ నుంచి తెర పైకి తీసుకురావాలి అని ఎంతో ప్రయత్నంలో చేస్తున్న హరీష్  ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ దూరం చేసుకోకూడదని మొండి పద్ధతులతో ఉన్నట్లుగా అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే… అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టు పనుల్లో నాగార్జున డైరెక్టర్ రైటర్ గా వర్క్ చేస్తున్నారని తెలిసింది. ఇంతకీ ఎవరా నాగ్ డైరెక్టర్ అంటే.. దశరథ్ అని తెలిసింది. త్రివిక్రమ్ తో పాటు ఇండస్ట్రీలోకి దాదాపు ఓకేసారి వచ్చిన రచయితల్లో దశరథ్ కూడా ఉన్నాడు. అతను మొదట రైటర్ గా వర్క్ చేసి ఆ తర్వాత నాగార్జునతో సంతోషం సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. త్రివిక్రమ్ సలహా మేరకే తెరి రీమేక్ కోసం అతన్ని రైటర్ గా పెట్టుకోవాలి అని హరిష్ శంకర్ కు పవన్ సూచించినట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా దశరథ్ నిర్మించిన లవ్ యు రామ్ అనే టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాకు దశరథ్ కూడా రైటర్ గా వర్క్ చేస్తున్నట్లుగా తెలిపారు. మరి..దశరథ్ ఇక నుంచి రైటర్ గా బిజీ అవుతాడేమో చూడాలి.

Also Read : పవన్, సుజిత్ మూవీ వెనుకున్న సీక్రెట్ ఇదేనా.?

RELATED ARTICLES

Most Popular

న్యూస్