Sunday, January 19, 2025
Homeసినిమాదశరథ్ చేతుల మీదుగా 'సందేహం' లిరికల్ సాంగ్

దశరథ్ చేతుల మీదుగా ‘సందేహం’ లిరికల్ సాంగ్

విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఊరికి ఉత్తరాన’ ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ‘చచ్చినా చావని ప్రేమిది’ అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజైంది.

ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ… ‘‘డైరెక్టర్ సతీష్ పరమదేవ గారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ‘సందేహం’ మూవీ లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేయ‌టం చాలా హ్యాపీగా ఉంది. పూర్ణాచారి గారు పాట‌ను అద్భుతంగా రాశారు. పాట వింటుంటే చాలా క్యాచీగా ఉంది. నిర్మాత స‌త్య‌నారాయ‌ణ‌ గారు, హీరో సుమ‌న్‌, హెబ్బా ప‌టేల్ ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.

మ‌న చౌదరి మాట్లాడుతూ… ‘‘సందేహం’ సినిమా నుంచి రిలీజైన ‘చచ్చినా చావని ప్రేమిది’ పాట చాలా బావుంది. ఈ సినిమా ఓపెనింగ్ నుంచి నాకు తెలుసు. ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డి అనుకున్న స‌మ‌యంలో సినిమాను పూర్తి చేశారు. సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్