Sunday, November 24, 2024
HomeTrending Newsరైతు సంక్షేమంతో..లాభాల బాటలో డీసీసీబీలు : మంత్రి ఎర్రబెల్లి

రైతు సంక్షేమంతో..లాభాల బాటలో డీసీసీబీలు : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం వరంగల్ డీసీసీబీ బ్యాంక్ డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణలో మంత్రి మాట్లాడారు.

‘ గతంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. రుణాల చెల్లింపులో ఇబ్బందులు పడేది.సీఎం కేసీఆర్ నాయకత్వంలో కరెంట్ ఫుల్ ఉంటుంది. బావుల్లో నీరు ఉంటుంది.గతంలో వేసిన బోర్లు కూడా ఇపుడు నీరు పోస్తున్నాయి.కాళేశ్వరం, దేవాదుల వల్ల చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. రైతు బంధు ద్వారా పెట్టుబడి అందుతుంది . రైతులంతా సంతోషంగా ఉన్నారని’ పేర్కొన్నారు. వరంగల్‌ బ్యాంక్‌ రైతు కుటుంబాలకు అన్ని విధాల లోన్స్ ఇవ్వడం శుభపరిణామని అన్నారు. బ్యాంక్‌ పాలకవర్గం తీసుకుంటున్న చర్యల వల్ల బ్యాంక్‌ లాభాల బాటలో పయనిస్తూ అనేక అవార్డులను పొందుతుందని వెల్లడించారు.

డీసీసీబీ బ్యాంక్ రాష్ట్రంలో నెంబర్ వన్ బ్యాంకుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సభ్యులు సేవా భావంతో పని చేసినప్పుడే రాజకీయ భవిష్యత్ ఉంటుందని వివరించారు.బ్యాంక్ అభివృద్ది కోసం ఎక్కడా రాజీ పడకుండా పని చేసినందుకు సభ్యులను, బ్యాంక్‌ సిబ్బందిని అభినందించారు. బ్యాంక్ మీద నమ్మకం కుదిరితే డిపాజిట్లు వస్తాయని తెలిపారు. దళిత బంధు మొత్తం బ్యాంక్‌లో డిపాజిట్ చేసేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, రైతు రుణ విమోచనా కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, బ్యాంక్ డైరెక్టర్లు, రైతు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్