Sunday, January 19, 2025
Homeసినిమామహేష్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ రూమర్..

మహేష్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ రూమర్..

మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ‘గుంటూరు కారం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ జూన్ 12 నుంచి స్టార్ట్ కానుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయనున్నాడు. ఇది పాన్ వరల్డ్ మూవీ. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్.నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఈ మూవీ సెట్స్ పైకి రానుంది.

ఇది అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండే కథ అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకోవాలి అనేది రాజమౌళి ప్లాన్. అయితే… ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ రూమర్ తెర పైకి వచ్చింది. మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలో మహేష్ కు జంటగా దీపికా పడుకునే, విలన్ గా అమీర్ ఖాన్ నటించనున్నారని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే… విపరీతంగా సర్క్యలేట్ అవుతుంది. దీంతో మహేష్ మూవీలో అమీర్ ఖాన్ విలన్ అనేది నిజమేనా..? అనేది ఆసక్తిగా మారింది.

అయితే.. ఇప్పటి వరకు ఇంకా స్ర్కిప్ట్ వర్క్ పూర్తి కాలేదట. ఫుల్ స్ర్కిప్ట్ కంప్లీట్ కావడానికి మూడు లేదా నాలుగు నెలలు టైమ్ పట్టచ్చు. ఆతర్వాత నటీనటులు ఎవరు అనేది ఆలోచిస్తారు. కథ కూడా పూర్తి కాకుండానే ఇలా గ్యాపిప్స్ వస్తుండడం విశేషం. ఈ సినిమా కోసం జక్కన్న బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్స్ ను రంగంలోకి దింపాలి అనుకుంటున్నారు. మరి.. ఈ పాన్ వరల్డ్ మూవీలో నటించే బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు ఎవరు అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్