Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్సన్ రైజర్స్..... నో రైజ్

సన్ రైజర్స్….. నో రైజ్

ఐపీఎల్ ఈ సీజన్ మొదటి విడతలో దారుణ పరాజయాలు మూటగట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు రెండో విడతలో కూడా ఏమాత్రం మారలేదు. ఈరోజు ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి పేవలమైన ప్రదర్శనతో ఓటమి పాలైంది. టాస్ గెల్చుకున్న హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే పరుగుల ఖాతా తెరవకముందే ఇన్నింగ్స్ మూడో బంతికే కీలక ఆటగాడు డేవిడ్ వార్నర్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ వృ ద్ధిమాన్ సహా (17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 18 పరుగులు) కూడా ఐదో ఓవర్లో ఔటయ్యాడు. కీలక బ్యాట్స్ మెన్  కెప్టెన్ విలియమ్సన్ (18) మనీష్ పాండే (17)లు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. చివర్లో అబ్దుల్ సమద్ (28), రషీద్ ఖాన్(22) లు జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నస్తానికి 134 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడ మూడు వికెట్లు సాధించగా, అన్రిచ్ నార్జ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు సాధించారు.

135 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఢిల్లీ 17.5 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 139 పరుగులు చేసి మరో విజయం తమ ఖాతాలో వేసుకుంది.  ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా 11 పరుగులు చేసి ఔటైనా ఆ తర్వాత శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ రెండో వికెట్ కు 52 పరుగులు రాబట్టారు.  శిఖర్ ధావన్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కెప్టెన్ రిశభ్ పంత్, అయ్యర్ లు  మరో వికెట్ పడకుండానే 67 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. అయ్యర్ 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల తో 47 పరుగులు; పంత్ 21  బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల తో 35 పరుగులు సాధించారు.

మొదటి ఓవర్లోనే వార్నర్ ను అవుట్ చేసి మొత్తం రెండు వికెట్లు సాధించిన ఢిల్లీ బౌలర్ అన్రిచ్ నార్జ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది

టోర్నీ వాయిదా పడే నాటికి ఏడు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక్క విజయం మాత్రమే దక్కించుకొని రెండు పాయింట్లతో చివరి స్థానంలో ఉన్న హైదరాబాద్ కు నేటి ఓటమితో ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లినట్లే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్