హస్తినలో అసలు లిక్కర్ స్కామ్ అంటూ ఏమి లేదని,ఉన్నదల్లా ఢిల్లీ లిక్కర్ పాలసీ మాత్రమే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. పాలసినే స్కామ్ గా అభివర్ణిస్తూ రాజకీయ కుట్రలకు బిజెపి తెర లేపిందని ఆయన దుయ్యబట్టారు.ఈ రోజు సాయంత్రం నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఢిల్లీ లో జరిగింది పాలసీ అని స్కామ్ ఎంత మాత్రం కాదన్న విషయం సిబిఐ, ఐటి లకు తెలుసు అని ఆయన చెప్పారు.దాంతో ఏమి తోచని బిజెపి నేతలు ఈ డి ని ముందు పెట్టి పొలిటికల్ ఎపిసోడ్ సాగిస్తున్నారని ఆయన ఎద్దేవాచేశారు. బహుశా ప్రపంచ చరిత్రలోనే ఆధారాలు లేకుండా అభియోగాలు మోపడం అంటే ఇదేనేమో నంటూ ఆయన ఎద్దేవాచేశారు.బిజెపి నేతల ఫిర్యాదు తోటే ఢిల్లీ ఈ డి ఎపిసోడ్ దారావాహికం కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు.బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలు కుడా ఇదే అంశాన్ని దృవీకరిస్తున్నాయాన్నారు.ఈ కేసులో శాసనమండలి సభ్యురాలు కలువకుంట్ల కవిత కు ఎటువంటి సంబంధం లేదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బ తీసే శక్తి సామర్ధ్యాలు ఇంకా ఎవరికీ రాలేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి జగదీష్ రెడ్డి వెంట నల్లగొండ, భోనగిరి యాదాద్రి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ లు బండా నరేందర్ రెడ్డి,ఎలిమినేటి సందీప్ రెడ్డి,స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.