Sunday, September 22, 2024
HomeTrending Newsఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌  ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం డీఎంసీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. వారిగెలుపు కోసం పార్టీ అధ్యక్షుడు అసద్‌ తీవ్రంగా కృషిచేస్తున్నారు. ప్రత్యంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గుజరాత్‌ అసెబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీచేస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్‌లో మొత్తం 14 సీట్లలో బరిలో నిలిచింది. ఇందులో 12 నియోజకవర్గాల్లో ముస్లింలకే సీట్లు కేటాయించింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని పలు వార్డుల్లో బహిరంగ సభల్లో మాట్లాడారు. గుజరాత్‌కు, ఢిల్లీలోని సీలంపూర్‌నకు పెద్ద తేడా ఏమీలేదని, రెండు చోట్లా అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కనీసం స్కూళ్లు సరిగ్గా లేవన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ను చోటా రిచార్జ్‌తో పోల్చారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కోసం ఏ ఒక్కరూ పనిచేయడం లేదని ఆరోపించారు. కొత్తగా స్కూళ్లు నిర్మించలేదని, పరిభ్రత కూడా అంతంత మాత్రంగా ఉందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్