Tuesday, November 26, 2024
HomeTrending Newsశ్రీగంధానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్

శ్రీగంధానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్

వ్యవసాయం లేకుండా భారతదేశం లేదని, రైతుల శ్రేయస్సు కోసం పంటలకు మద్దతు ధరపై కేంద్రం చట్టం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో గతంలోలా రాష్ట్ర వ్యవసాయ చట్టం, నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్లను మరింత పటిష్టం చేయాలన్నారు. మార్కెటింగ్, ఉద్యాన శాఖ, వేర్ హౌసింగ్, మార్క్ ఫెడ్, హాకా సంస్థలపై హిమాయత్ నగర్ మార్కెటింగ్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్లలో మార్కెట్ ఫీజు పకడ్భంధీగా వసూలు చేయాలి .. చెక్ పోస్టులు అన్నింటినీ బలోపేతం చేయలని మంత్రి అన్నారు. రాబోయే కాలంలో వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల నేపథ్యంలో మార్కెట్లలో వసతులు సమకూర్చాలి .. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. యాసంగిలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరగాలని, పప్పుగింజలు, నూనెగింజలు అధికంగా సాగు చేయాలని మార్కెట్ రీసెర్చ్ & అనాలసిస్ వింగ్ సూచన చేసిందన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అంతర్జాతీయ స్థాయి వసతులతో పండ్ల మార్కెట్ ఏర్పాటు జరగనున్నది .. డీపీఆర్ రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.

కొల్లాపూర్ లో మామిడి మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, జగిత్యాల జిల్లాలో పెద్ద మొత్తంలో వస్తున్న మామిడి ముంబయికి వెళ్తుందని మంత్రి తెలిపారు. కొల్లాపూర్ మామిడికి అక్కడే మార్కెట్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ మార్కెట్ మీద వత్తిడి తగ్గుతుందన్నారు. హైదరాబాద్ మార్కెట్ కు వచ్చేది ప్రధానంగా దక్షిణ తెలంగాణ మామిడి .. ముఖ్యంగా కొల్లాపూర్ మామిడి అని మంత్రి తెలిపారు. ఉద్యాన పంటల అమ్మకాలలో రైతులు నష్టపోకుండా చర్యల తీసుకోవాలి .. దీనిపై వివిధ రాష్ట్రాల మార్కెట్లను అధ్యయనం చేసి రైతులకు లాభం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, ఖమ్మంలలో మిరప ట్రేడింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

హాకా పటిష్టతకు కార్యాచరణ రూపొందించాలని, వివిధ ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలకు నిత్యావసర వస్తువుల సరఫరా దిశగా హాకా ఆలోచించాలి .. ఈ దిశగా వెంటనే దృష్టి సారించి నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏడాదికి 20 వేల మెట్రిక్ టన్నుల శ్రీ గంధానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉంది .. శ్రీగంధం సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి .. శ్రీ గంధం అమ్ముకునేందుకు అటవీ నిబంధనలు సరళతరం చేయాలి. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు వేల ఎకరాలలో శ్రీగంధం సాగవుతుంది .. ఇది ప్రతి ఏటా పెరుగుతున్నదన్నారు. పట్టణప్రాంతాల చుట్టూ కూరగాయల సాగు పెంపుపై దృష్టి సారించాలి. వేర్ హౌసింగ్ గోదాముల నిర్మాణం వేగవంతం చేయాలి. ఏ ఇబ్బందులున్నా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని మంత్రి అన్నారు.

Also Read : నిమ్స్ లో అత్యాధునిక వైద్య సదుపాయాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్