Sunday, January 19, 2025
HomeసినిమాDevara: ఎన్టీఆర్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్!

Devara: ఎన్టీఆర్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్!

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల ఎన్టీఆర్, జాన్వీ కపూర్; ఎన్టీఆర్-సైఫ్ ఆలీఖాన్ లపై  కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న అప్ డేట్ ఇవ్వనున్నారని తెలిసింది. టీజర్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేస్తారట. చాలా టైటిల్స్ పరిశీలించి ఫైనల్ గా ‘దేవర’ ఖరారు చేశారని టాక్ వినిపిస్తుంది. అనిరుథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను  ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘ఆచార్య’ డిజాస్టర్ కావడంతో కొరటాల శివ కథ విషయంలో కేర్ తీసుకొని చాలా రోజులు కసరత్తు చేశాడు. కథ అందరికీ సంతృప్తికరంగా రావడంతో ఎట్టకేలకు  సినిమా స్టార్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టుగా గతంలోనే ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్