Sunday, January 19, 2025
HomeTrending Newsఅభివృద్ధి అంతా మాదే : పురంధేశ్వరి

అభివృద్ధి అంతా మాదే : పురంధేశ్వరి

our credit: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్మోహనరెడ్డికి చిత్తశుద్ధి లేదని బిజెపి జాతీయ నాయకురాలు పురంధరేశ్వరి విమర్శించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని,  పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు . రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు  కూడా వెనక్కి వెళ్లి పోతున్నాయని,  ఏపీలో రహదారుల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో జరుగుతున్న  ప్రతి  అభివృద్ధి  పనిలో కేంద్ర ప్రభుత్వ సహాయం ఉందని,  జగన్ ప్రభుత్వం సొంతంగా  చేస్తున్నఅభివృద్ధి శూన్యం అని ఆమె అన్నారు.  ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలుపు ఏ ఒక్కరి  కృషి వల్ల కాదని,  అది బిజెపి కార్యకర్త కార్యకర్తలందరి సమిష్టి కృషి అని పురంధరేశ్వరి వెల్లడించారు.  భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే బలమని  చెప్పారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్