దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
శ్రీహర్ష మాట్లాడుతూ “రౌడీ బాయ్స్ లో 9 పాటలున్నాయి. అన్ని పాటలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. అందులో రెండు కాలేజీ ఫెస్ట్ సాంగ్స్. ఈ సినిమా రిలీజ్ తర్వాత కాలేజీ ఉత్సవాల్లో ఆ పాటలే ప్లే అవుతాయని అనుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్ గారితో పని చేయాలన్న నా కలను నేరవేర్చిన దిల్ రాజు గారికి థాంక్స్” అన్నారు.
హీరో ఆశిష్ మాట్లాడుతూ “టైటిల్ సాంగ్ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. అనుపమ కొన్ని కారణాలతో ఈవెంట్‌కు రాలేకపోయింది. తన వల్ల, దేవిశ్రీప్రసాద్ గారి వల్ల, దిల్ రాజు గారి వల్ల ఈ సినిమాకు చాలా మంచి క్రేజ్ వస్తుంది. డైరెక్టర్ హర్షకు థాంక్స్. నా లుక్ విషయంలో కేర్ తీసుకున్న అక్కయ్యకు థాంక్స్. థియేటర్లలో కలుద్దాం” అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా హీరో దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే అందరూ కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే అందరినీ మెప్పించాల్సింది సంగీతం మాత్రమే. నాకు, దేవిశ్రీతో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమా చేయడానికి ఓకే అన్నాడు. కథ విన్న తర్వాత నుంచి దేవిశ్రీ ప్రసాద్ సినిమాతో ట్రావెల్ అవుతున్నాడు. ఏ సందర్భంలో ఏ పాట ఉండాలి, ఎలా ఉండాలని అని తను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. మా జర్నీలో అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. దేవిశ్రీ కి థాంక్స్” అన్నారు.
‘హుషారు’ సినిమాతో యూత్ లో హుషారు నింపిన డైరెక్టర్ హర్ష ఇప్పుడు ‘రౌడీ బాయ్స్’ తో నెక్ట్స్ లెవల్ మూవీ చేశాడు. యూత్‌కు కావాల్సిన అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎగ్జయిటింగ్ సీన్స్, క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ. చాలా కాలం తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న యూత్ మూవీ ఇది. అనుపమ పరమేశ్వరన్ ఇది వరకు మా బ్యానర్‌లో ‘శతమానం భవతి’, ‘హలోగురూ ప్రేమకోసమే’ చేసింది. ఈ సినిమా స్టార్ట్ చేయడం కంటే ముందు అనుపమ ఇద్దరూ హీరోల కంటే పెద్ద వ్యక్తిగా కనిపిస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ, తను అద్భుతంగా చేస్తుందని నేను నమ్మాను”
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ “ఆశిష్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం అనేది నా బాధ్యత. మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుని ఉండుంటే నేను వారింటి ముందు దర్నా చేసేవాడిని. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న ఆశిష్‌కు అభినందనలు. హర్షతో వర్క్ చేయడం హ్యాపీ. తను యూత్‌ఫుల్‌గా ఈ సినిమాను చేశాడు. ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా నచ్చే సినిమా. ఇప్పటి వరకు చాలా యూత్‌ఫుల్ సినిమాలు చూశాం. ప్రతి ఐదేళ్లకో, పదేళ్లకో యూత్‌ఫుల్ ఫిల్మ్ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మళ్లీ అలా యూత్ అందరూ కలిసి నవ్వుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, కాలేజీ డేస్‌ను ఈ సినిమాతో గుర్తు చేసుకుంటారు. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.