Saturday, January 18, 2025
Homeసినిమావామ్మో! ధనుష్ కు అంతా?

వామ్మో! ధనుష్ కు అంతా?

కోలీవుడ్ హీరో ధనుష్ – టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ధనుష్ వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాని కాస్త ఆలస్యంగా జనవరిలో ప్రారంభించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో కథానాయిక సాయిపల్లవి అంటూ వార్తలు వచ్చాయి. ఆతర్వాత సమంత పేరు కూడా వినిపించింది కానీ.. ఇప్పటి వరకు కథానాయిక ఎవరు అనేది ఇంకా ఫైనల్ చేయలేదని సమాచారం.

ఇక అసలు విషయానికి వస్తే.. ధనుష్ తమిళ చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లో నటించాడు. అలాగే హాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు. అతనికున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని 50 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలిసింది. కోలీవుడ్ లో ధనుష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కి డబుల్ ఇది. ఇక మూవీ బడ్జెట్ ఎంతంటే.. దాదాపు 120 కోట్ల అని తెలిసింది. ఇప్పటి వరకు మిడియం బడ్జెట్ లో సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటించే నటీనటులు, అలాగే సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. అంతా పూర్తైన తర్వాత సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు అనేది అఫిసియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్