Sunday, January 19, 2025
HomeTrending Newsబండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు- ధర్మపురి అరవింద్

బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు- ధర్మపురి అరవింద్

ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ ధర్మపురి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించబోనని స్పష్టం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకోవాలని అరవింద్ పేర్కొన్నారు. అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదని, కోఆర్డినేషన్ సెంటర్ మాత్రమె అని ఢిల్లీలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

తెలంగాణ సంస్కృతిలో అనేక సామెతలు ఉంటాయని, సామెతలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగించాలని బండి సంజయ్ కి హితవు పలికారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయని, ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇక, ఈడీ విచారణకు కవిత సహకరిస్తే మంచిదని అరవింద్ అభిప్రాయపడ్డారు. లేకపోతే వీలైనంత త్వరలో కస్టడీలోకి తీసుకునే అవకాశముందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్