Friday, May 31, 2024
Homeసినిమా‘శరపంజరం ‘ మొదటి పాటను విడుదల చేసిన‌ విజయేంద్రప్రసాద్

‘శరపంజరం ‘ మొదటి పాటను విడుదల చేసిన‌ విజయేంద్రప్రసాద్

Shara Panjaram: గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది. ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు వీరి పై ఎలాంటి వ్యతిరేకత కనబరిచారు అనే పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న చిత్రమే “శరపంజరం”. దోస్తాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో టీ. గణపతి రెడ్డి ,మల్లిక్ ఎం వీ కే నిర్మిస్తున్న ఈ చిత్రం లోని మొదటి పాటను, మరియు, ఫస్ట్ గ్లిమ్స్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.

 ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మొదటి పాటను విడుదల చేయగా.. సంగీత దర్శకుడు ఆర్. పి.పట్నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు. మామిడాల హరికృష్ణ , ఉడుగుల వేణులు నాలుగు నిమిషాల డి.సి.పి ని రిలీజ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈటెల జమున, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, చరణ్, మరాఠీ దర్శకుడు నవీన్ దేశబోయిన, టిప్స్ మ్యూజిక్ రాజు హిర్వాని, దర్శకుడు వినయ్ బాబు గౌడ్, మ్యూజిక్ డైరెక్టర్, యమ్.అల్. రాజ, అమూల్యతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… కాలం మారినా ఇంకా కొన్ని చోట్ల జోగిని లాంటి దూరాచారాలు మారకుండా ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని రూపు మాపే క్రమంలో చిత్ర, దర్శక, నిర్మాతలు జోగిని వంటి సామాజిక సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ లు చాలా బాగా నటించారు. పాటలు చాలా బాగున్నాయి. మంచి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని కోరుతున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్