Sunday, January 19, 2025
Homeసినిమా‘థ్యాంక్యూ’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్

‘థ్యాంక్యూ’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్

Thank You in theaters:
అక్కినేని నాగ‌చైత‌న్య‌, మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్త‌య్యింది కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ కాలేదు. అయితే.. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య ‘బంగార్రాజు’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

అయితే ‘థ్యాంక్యూ’ థియేట‌ర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్త‌లు వ‌చ్చాయి. థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌స్తున్నారు. సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్లో రిలీజైన ల‌వ్ స్టోరీ, అఖండ సినిమాలు భారీ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి భారీ విజయం సాధించాయి. సంక్రాంతికి భారీ చిత్రాలు థియేట‌ర్లో వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో నాగ‌చైత‌న్య థ్యాంక్యూ మూవీని థియేట‌ర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారనే వార్త‌లు నాగ చైతన్య అభిమానులను నిరాశకు గురిచేశాయి.

ఈ వార్తలపై థ్యాంక్యూ మేక‌ర్స్ స్పందించారు. “థ్యాంక్యూ మూవీ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌లో ఉంది. బిగ్ స్ర్కీన్ లో చూపించాల‌నే ఈ మూవీ చేయ‌డం జ‌రిగింది. క‌రెక్ట్ టైమ్ లో ‘థ్యాంక్యూ’ ని థియేట‌ర్లోనే రిలీజ్ చేస్తాం” అని తెలియ‌చేశారు.

Also Read : నాగ‌చైత‌న్య బర్త్ డే సంద‌ర్భంగా ‘థాంక్యూ’ ఫస్ట్ లుక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్