Thursday, May 30, 2024
Homeసినిమానెంబర్ 1 వివాదంపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

నెంబర్ 1 వివాదంపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రం వరిసు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని వారసుడు అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ కు అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే.. తమిళనాడులో అజిత్ కంటే విజయే పెద్ద హీరో అని.. ఇంకా చెప్పాలంటే విజయ్ నెంబర్ 1 హీరో అని దిల్ రాజు అనడం వివాదస్పదం అయ్యింది.

దీంతో అజిత్ అభిమానులు దిల్ రాజు పై ఫైర్ అయ్యారు. ఈ విషయం గురించి ఓ ప్రెస్ మీట్ లో దిల్ రాజుని వివరణ అడిగితే… నేను ఒకటి అంటే.. మరోలా అర్థం చేసుకున్నారని ఒకర్ని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశ్యం తనది కాదన్నారు. అయితే… ఇది అజిత్ అభిమానుల‌కు అస్స‌లు రుచించ‌లేదు ఈ విష‌య‌మై విజ‌య్, అజిత్ అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వేదిక‌గా కొన్ని రోజుల పాటు గొడ‌వ న‌డిచింది. ఈ వివాదం పై దిల్ రాజు.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఇంతకీ ఏమన్నారంటే.. విజ‌య్ త‌మిళంలో నంబ‌ర్ వ‌న్ హీరో అనే మాట‌కు తాను క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు రాజు తెలియచేశారు. ఒక హీరో స్టార్ ప‌వ‌ర్ ఏంట‌న్న‌ది థియేట్రిక‌ల్ రెవెన్యూను బట్టే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని.. ఈ కోణంలో త‌మిళంలో విజ‌యే నంబ‌ర్ వ‌న్ హీరో అని రాజు అన్నారు. విజ‌య్ న‌టించిన గ‌త అయిదారు సినిమాలు టాక్‌, రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా త‌మిళ‌నాట మినిమం రూ.60 కోట్ల షేర్ రాబ‌ట్టాయ‌ని.. ఈ రికార్డు త‌మిళంలో ఇంకెవ‌రికీ లేద‌ని.. అందుకే అక్క‌డున్న అంద‌రు హీరోల‌ కంటే విజ‌య్ బిగ్ స్టార్ అన్న‌ది త‌న అభిప్రాయ‌మ‌ని దిల్ రాజు స్ప‌ష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్