Saturday, January 18, 2025
Homeసినిమా'వారసుడు' మహేష్‌, చరణ్‌ చేయాల్సిన మూవీనా?

‘వారసుడు’ మహేష్‌, చరణ్‌ చేయాల్సిన మూవీనా?

ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ‘వారసుడు‘ కూడా భారీ స్థాయిలో విడుదలవుతోంది. వంశీ పైడిపల్లి దీనికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో విజయ్ కు జంటగా క్రేజీ హీరోయిన్ రష్మిక నటించింది. సంక్రాంతికి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రం రిలీజ్ రోజునే ఈ సినిమా కూడా విడుదలవుతుండడం విశేషం.

ఇదిలా ఉంటే… వారసుడు సినిమాకు సంబంధించి దిల్ రాజు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ సినిమాకు హీరోగా తొలుత విజయ్ ను అనుకోలేదని చెప్పారు. మరి ఎవర్ని అనుకున్నారంటే.. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో ఈ భారీ చిత్రాన్ని చేయాలని అనుకున్నారట. వంశీ పైడిపల్లి మహేష్‌ బాబుతో మహర్షి అనే సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో వంశీ పైడిపల్లితో మరో సినిమా  చేయాలనుకున్నారు మహేష్‌. అయితే.. లాస్ట్ మినిట్ లో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత చరణ్‌ తో  కూడా  అనుకున్నారట.

చరణ్‌, శంకర్ సినిమాలో బిజీగా ఉండడంతో కుదరలేదట. అప్పుడు విజయ్ తో సినిమా చేయాలి అనుకున్నామని.. విజయ్ కథ విని వెంటనే ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందని నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహేష్ బాబు, చరణ్ తో చేయాలి అనుకుంటే.. ఆఖరికి విజయ్ తో సెట్ అయ్యింది. విజయ్ సినిమా తెలుగులో భారీగా రిలీజ్ అవుతుంది. మరి.. ఈ సినిమాతో విజయ్ తెలుగులో ఎంత వరకు ఆకట్టుకుంటాడో… ఓవరాల్ గా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read : వారసుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్