Sunday, February 23, 2025
Homeసినిమాబాలయ్యతో ప్లాన్ చేస్తున్న దిల్ రాజు!

బాలయ్యతో ప్లాన్ చేస్తున్న దిల్ రాజు!

దిల్ రాజు తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి వరుస సినిమాలు నిర్మిస్తూ వెళుతున్నారు. ఆయన ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను .. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కథలను ఎంచుకుంటూ ఉంటారు. తన కెరియర్లో ఎక్కువ సక్సెస్ లు ఇచ్చిన దిల్ రాజు, ఇప్పుడు మరింత భారీ ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకుని వెళుతున్నారు. అలా ఆయన ఒక సినిమాను బాలయ్యతో ప్లాన్ చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో బాలయ్య వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఒకదానికి మించి మరొకటి ఆయన సినిమాలు సంచలనాలు సృష్టిస్తూ వెళుతున్నాయి. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే చాలావరకూ పూర్తయింది. ఆ తరువాత ఆయన బోయపాటితో చేయవలసి ఉంది. ‘అఖండ’ సినిమాకి ఇది సీక్వెల్. కెరియర్ పరంగా బాలయ్యకి ఇది 110వ సినిమా. అందువలన అభిమానులంతా ఈ సినిమాపై అంచనాలతో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే బాలయ్యతో ఒక సినిమా చేయడానికి దిల్ రాజు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. బాలయ్యతో దిల్ రాజు ఇంతవరకూ సినిమా చేయలేదు. అందువలన ఈ సారి తప్పకుండా బాలయ్యతో ఒక సినిమా చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నారని అంటున్నారు.ఆల్రెడీ బాలయ్య కోసమని కొన్ని కథలను ఆయన సిద్ధం చేసుకున్నారట. వాటిలో బాలయ్యకి ఏది నచ్చితే ఆ కథతో ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. బాలయ్య 111వ సినిమాగా ఇది ఉండొచ్చని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్