Sunday, January 19, 2025
Homeసినిమా'ఆకాశం దాటి వస్తావా' మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా

‘ఆకాశం దాటి వస్తావా’ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా

నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నం.2గా రూపొందుతోన్న సినిమాకు ‘ఆకాశం దాటి వస్తావా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కొరియోగ్రాఫర్ యష్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. కార్తీక మురళీధరన్ హీరోయిన్. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా విడుదల చేశారు. శశికుమార్ ముతులూరి దర్శకత్వంలో హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ “ఓ సంద‌ర్భంలో కొరియోగ్రాఫ‌ర్ య‌ష్‌ను చూడ‌గానే బావున్నాడ‌నిపించింది. నా సినిమాలో కొరియోగ్రాఫ‌ర్‌గా అవ‌కాశం ఇస్తాన‌ని అన్నాను. బ‌ల‌గం సినిమా సెట్స్‌పై ఉన్న స‌మయంలో శ‌శిని పిలిచి బ‌లగం త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో కొత్త‌వాళ్ల‌తో సినిమా చేయాల‌నుకున్నా. యాష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆలా ఈ ప్రాజెక్టులోకి యశ్ వచ్చాడు. సింగ‌ర్ కార్తీక్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. మ‌హేష్ ఈ సినిమాకు స్టోరి, డైలాగ్స్ అందించారు. యూత్‌ఫుల్ సినిమాను తీసుకొస్తున్నాం. శ‌శి ప‌ర్స‌న‌ల్ లైఫ్ నుంచి ఈ స్టోరీని చేశారు’ అని అన్నారు.

శశికుమార్ మాట్లాడుతూ.. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో యష్, కార్తీక మురళీధరన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

హీరో య‌ష్ మాట్లాడుతూ “ఇదంతా నాకొక క‌ల‌లాగానే ఉంది. రాజుగారికి థాంక్స్‌. రాజుగారు ఫోన్ చేసి పిల‌వ‌గానే ఆయ‌న సినిమాలో కొరియోగ్ర‌ఫీ చేయాలేమోన‌ని వెళ్లాను. తీరా హీరో నువ్వేన‌ని చెప్ప‌గానే ఆశ్చ‌ర్య‌పోయాను. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ సినిమా ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. నేను ఈ సినిమా చేయ‌గ‌ల‌ను అని న‌మ్మి అవ‌కాశం ఇచ్చినందుకు రాజుగారికి థాంక్స్‌. శ‌శిగారికి థాంక్స్‌. హ‌ర్షిత్‌గారు, హ‌న్షిత గారికి థాంక్స్‌. `ఆకాశం దాటి వ‌స్తావా` మంచి ల‌వ్ జ‌ర్నీ. అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్“ అన్నారు.

కార్తీక ముర‌ళీధ‌ర‌న్ మాట్లాడుతూ “దిల్ రాజుగారితో క‌లిసి సినిమా చేయ‌టం గౌర‌వంగా భావిస్తున్నాను. మ‌ల‌యాళంలో ఇది వ‌ర‌కు రెండు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా తొలి సినిమా. య‌ష్‌, శ‌శి వంటి మంచి టీమ్‌తో ప‌నిచేశాను. తెలుగు ప్రేక్ష‌కులు ఆశీర్వాదాన్ని అందిస్తార‌ని భావిస్తున్నాను“ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్