Saturday, January 18, 2025
Homeసినిమా‘తిరగబడర సామీ’  ఫుల్ మాస్ : దిల్ రాజు

‘తిరగబడర సామీ’  ఫుల్ మాస్ : దిల్ రాజు

రాజ్ తరుణ్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇదివరకే  విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. ఈరోజు దిల్ రాజు ఈ చిత్రం టీజర్ లాంచ్ చేశారు.

దిల్ రాజు మాట్లాడుతూ… ఏఎస్ రవికుమార్ చౌదరి ‘పిల్లా నువ్వు లేని జీవితం’ లాంటి హిట్ చిత్రాలని అందించిన మా దర్శకుడు. అలాగే రాజ్ తరుణ్ ‘ఉయ్యాలా జంపాల’, ‘సినిమా చూపిస్తా మావా’ లాంటి  ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు. రాజ్ తరుణ్ ఎక్స్ టార్దినరీ ఆర్టిస్ట్. ఈ టీజర్ చూస్తుంటే.. అండర్ ప్లే పాత్ర చేసి ఫైనల్ గా తిరగబడరసామీ అని క్లైమాక్స్ లో ఇరగదీసినట్లు అర్ధమౌతుంది. ఎంటర్ టైమెంట్ సినిమా అనుకున్నాను. టీజర్ చూస్తుంటే  ఫుల్ మాస్ సినిమాలా వుంది. రాజ్ తరుణ్, రవి కుమార్ కమ్ బ్యాక్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. దర్శకుడు రవికుమార్ చౌదరి గారు ఈ సినిమాతో నాలో కొత్త కోణం చూపించారు. నేను చిన్నచిన్నగా తప్పితే యాక్షన్ పెద్దగా ఎపుడూ చేయలేదు. క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు కూడా అడిగాను. ఇంతసేపు సైలెంట్ గా వున్నావ్ కాబట్టి ఎప్పుడో ఒకసారి పేలాల్సిందే అని చెప్పారు’. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే విడుదల చేస్తాం. మీ అందరికీ నచ్చుతుంది. దయచేసి అందరూ థియేటర్స్ లోనే  చూడాలి. డోంట్ యంకరేజ్ పైరసీ’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్