Saturday, January 18, 2025
Homeసినిమామాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది - బాబీ

మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది – బాబీ

చిరంజీవి, శృతి హాసన్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించారు. చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తే.. రవితేజకు జంటగా కేథరిన్ నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఈరోజు గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ షో నుండి మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో వాల్తేరు వీరయ్య యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ… ఈ సినిమాతో నా అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేసే అవకాశం రావడం.. అలానే అది రిలీజ్ అయి ఫస్ట్ షో నుండి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. హీరోగా చేసిన చిరంజీవి గారి దగ్గరి నుండి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, డీవోపీ ఆర్ధర్ ఏ విల్సన్, నిర్మాతలు నవీన్ గారు, రవిశంకర్ గారు ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్ తో పాటు నటీనటులు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఫైనల్ గా నేడు మూవీకి ఇంత భారీ రెస్పాన్స్ వస్తుండడం మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా ఉంది. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి, మెగా ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్