Sunday, January 19, 2025
HomeసినిమాDevara Two Parts: 'దేవర' రెండు పార్టులు. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడు..?

Devara Two Parts: ‘దేవర’ రెండు పార్టులు. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడు..?

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్టర్. ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేయనున్నట్టు దర్శకుడు కొరటాల ప్రకటించారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పచ్చు. గొప్ప కథను రెండున్నర గంటల్లో చెప్పలేమని.. ప్రతి పాత్ర, సన్నివేశం డీటైలింగ్ గా చెప్పాలి.. అలాగే ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతి ఇవ్వడం కోసం రెండు పార్టులుగా తీస్తున్నామని కొరటాల చెప్పారు.

మరి.. ఈ సినిమాల రెండు పార్టులు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే.. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. సెకండ్ పార్ట్ ఎప్పుడు విడుదల అనేది మాత్రం చెప్పలేదు. దేవర సినిమా పూర్తి చేసి ఎన్టీఆర్ డిసెంబర్ నుంచి వార్ 2 మూవీ చేయనున్నారు. ఆతర్వాత ప్రశాంత్ నీల్ తో మూవీ చేయాలి. అందుచేత వార్ 2 తో పాటు దేవర 2 కూడా చేస్తారని టాక్ వినిపిస్తుంది. సముద్రం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న దేవర మూవీని అత్యంత ప్రతిష్టాతక్మకంగా నిర్మిస్తున్నారు.

ఇప్పుడు కొరటాల మాటలు వింటుంటే.. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప రేంజ్ లో దేవర మూవీ భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు దేవర చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నాయి. మరి.. రెండో పార్ట్ ఎప్పుడు రిలీజ్ అంటే.. 2025 సమ్మర్ తర్వాత విడుదల అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్