Saturday, January 18, 2025
Homeసినిమాసోషల్ మీడియాకి ‘కొరటాల’ గుడ్ బై

సోషల్ మీడియాకి ‘కొరటాల’ గుడ్ బై

‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు కొరటాల శివ. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు. తన సినిమాలకు సంబంధించిన వివరాలను.. తన అభిప్రాయలను సోషల్ మీడియా ద్వారా పంచుకునేవారు. ఇక పై సోషల్‌ మీడియాకు దూరంగా ఉండబోతున్నా అని ఓ ప్రకటన ద్వారా తెలియచేశారు.

ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు. ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పడం ఏంటి అని అడిగితే.. ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వలన సమయం ఉండడం లేదు. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే.. తన సినిమాలకు సంబంధించిన వివరాలను మీడియా ద్వారా తెలియచేస్తుంటాను. ఈ విధంగా అందుబాటులో ఉంటాను అని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్