దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ.. నటుడిగా విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ.. మెప్పిస్తున్న అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా, రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్ పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదలవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ సందర్భంగా హీరో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ… ఐడియా వచ్చినప్పుడు ఇది నా ఆలోచన అనుకుంటే, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌లో ఇది అందరి కథగా మారింది. ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. అందరూ ఇది నా సినిమా అని ఫీలై చేశారు. శక్తికాంత్ కార్తీక్ .. కథ వినగానే కనెక్ట్ అయిపోయి, అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. మిమ్మల్ని నవ్విస్తుంది. సెప్టెంబర్ 3న సినిమా విడుదలవుతున్న సినిమా మాట్లాడుతుంది అన్నారు.
క్రిష్ జాగర్లమూడి మాట్లాడుతూ… ‘కంచె’ సినిమా చేస్తున్న సమయంలో ఓ రోజు అవసరాల గారు జార్జియాలో నాతో మాట్లాడుతూ ప్రతి మనిషిలోనూ ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. వాటి వల్ల వాళ్లే వారి జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటారు. ఆ పాయింట్‌ను హిలేరియస్‌గా చూపిస్తానంటూ ఇరవై నిమిషాల కథను చూపించారు. బాగా నవ్వుకున్నాం. నాకు, రాజీవ్ గారికి కథ బాగా నచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత అంటే 2017లో డైరెక్టర్ సాగర్ గారిని కలిశాను. ఆయన విలేజ్‌లో జరిగే ఓ థ్రిల్లర్ కథను చెప్పారు. అవసరాలతో ఆ కథను చేద్దామని నేను, రాజీవ్ గారు అనుకుంటున్న సమయంలో.. నేనే రెండేళ్ల ముందు మీరొక కథ చెప్పారు కదా అని గుర్తు చేశాను. దానికి 101 జిల్లాల అందగాడు అనే పేరు పెట్టామండి అని కథ చెప్పాడు. ఇది చాలా మంది కథ, చాలా మంచి కథ దీన్ని సినిమా తీద్దామని అన్నాను. ‘కంచె’ సినిమా సమయంలో ప్రారంభమైన ఈ సినిమా సెప్టెంబర్ 3న కంచెకు చేరబోతుంది.
అవసరాల శ్రీనివాస్ పర్‌ఫెక్షనిస్ట్. సినిమా కోసం ఐదారు నెలల పాటు గుండుతోనే ఉన్నారు. చాలా ప్యాషన్‌తో చేసుకున్న కథ. ఆయన ఎంత ప్యాషన్‌గా రాసుకున్నారో అంతే ప్యాషన్ ఉన్న టీమ్ తయారైంది. డైరెక్టర్ రాచకొండ విద్యాసాగర్‌గారు చాలా ప్యాషన్‌తో, డెప్త్ గా ఆలోచించి సినిమాను తీర్చిదిద్దారు. రామ్ సినిమాటోగ్రఫీ, రామాంజనేయులు ఆర్ట్ వర్క్, శక్తికాంత్ మ్యూజిక్, కిరణ్ ఎడిటింగ్ అంతే గొప్పగా ఉన్నాయి. మంచి కథలు చెప్పాలని సినిమాలు చేస్తున్న మాకు దిల్‌రాజు గారు, శిరీష్ గారు వంటి మంచి నిర్మాతలు చేరువయ్యారు. వారికి మా స్పెషల్ థాంక్స్. చాలా మంచి ఎంటర్‌టైనర్‌గానే కాదు, చాలా మంచి మీనింగ్ ఉన్న సినిమా ఇది. అవసరాల అందరినీ నవ్విస్తాడు. `101 జిల్లాల అందగాడు`తో అవసరాల శ్రీనివాస్- నవరసాల శ్రీనివాస్ గా పేరు తెచ్చుకుంటాడు. సెప్టెంబర్ 3 కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు.
డైరెక్టర్ రాచకొండ విద్యాసాగర్ మాట్లాడుతూ… నాకు కొన్నిరోజుల ముందు హెల్త్ సమస్య రావడంతో నేను సరిగ్గా నడవలేకపోయాను. ఆ సమయంలో మా సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ ఏమైనా జరిగితే ఎలా అని తెగ మథనపడ్డాను. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ అయిన తర్వాత ఆలోచిస్తే.. మనలోని ఇన్‌సెక్యూరిటీస్‌ను విడిచి పెట్టేయమనే కదా, మన సినిమాలో చెప్పింది అనిపించింది. నాకు సమస్య వచ్చింది.. తగ్గిపోయింది. అది ఒప్పుకోవడానికి ఎంత భయపడ్డాను. శ్రీను అద్భుతమైన కథను రాశారు. అది నా కథ కూడా. ఈ కథ ఎంతో మందిని కదిలిస్తుంది. సెప్టెంబర్ 3న సినిమా విడుదలవుతుంది. సినిమా చూసిన ప్రతిసారి కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అంత గొప్ప ఎమోషన్స్ సినిమాలో ఉన్నాయి. అంజలి అనే పాత్రలో రుహానీ శర్మ.. బ్రిలియంట్‌గా నటించింది. ఎవరి జీవితాన్నో మనం దగ్గర నుంచి చూస్తున్నట్లు అనిపిస్తుంది. మన ఇంటి పక్కనుండే జి.ఎస్.ఎన్ అనే పాత్రలో అవసరాల శ్రీనివాస్ అద్భుతంగా నటించారు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. శక్తికాంత్ గారు కథలోని ఎమోషన్స్‌కు తగిన సంగీతాన్ని ఇస్తే.. రామ్ గారు కథను నేను అనుకున్నదానికంటే గొప్ప విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ కిరణ్ గారు ఎక్స్‌ట్రార్డినరీగా ఎడిట్ చేశారు. మంచి పాటలు కుదిరాయి. సెప్టెంబర్ 3న సినిమా విడుదలవుతుంది అన్నారు.