With Whom: ‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి. ఆ తర్వాత బస్టాప్, ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, ప్రతి రోజు పండగే.. ఇలా విజయవంతమైన చిత్రాలు అందించారు. ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అనే సినిమాను తెరకెక్కించారు. జులై 1న పక్కా కమర్షియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా ప్రభాస్ తో మారుతి సినిమా చేయనున్నాడు అని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ ఇదేదో గాసిప్ అనుకున్నారు కానీ.. ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే.. ఇది నిజమే అని. రెండు మూడు నెలల క్రితమే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారని గట్టిగా వార్తలు వచ్చాయి. ఇదే విషయం గురించి మారుతిని అడిగితే.. ప్రభాస్ తో సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ప్రభాస్ తో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ తీస్తానని ప్రకటించారు.
అయితే.. ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆతర్వాత స్పిరిట్ మూవీ చేయాల్సివుంది. అందుచేత ఇప్పటికిప్పుడు ప్రభాస్ డేట్స్ దొరకవు. మరి.. మారుతి అంత వరకు వెయిట్ చేస్తాడా..? లేక ఈ గ్యాప్ లో వేరే సినిమా చేస్తాడా.? అనేది ఆసక్తిగా మారింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. మారుతి ప్రభాస్ డేట్స్ ఇవ్వడం మరీ ఆలస్యం అయితే.. ఈ లోపు నానితో ఓ సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తోంది. మరి.. త్వరలోనే మారుతి నెక్ట్స్ మూవీ పై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.