‘యువత’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించాడు పరశురామ్. ఆతర్వాత ‘సోలో’ తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడంతో అందరి దృష్టి పరశురామ్ పై పడింది. అయితే.. గీతా ఆర్ట్స్ లో అల్లు శిరీష్ తో ‘శ్రీరస్తు శుభమస్తు’ తో మరో సక్సెస్ సాధించడంతో ఇదే సంస్థలో మరో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అదే.. గీత గోవిందం. చిన్న సినిమాగా రిలీజైన గీత గోవిందం పెద్ద విజయం సాధించి భారీ లాభాలు అందించింది. దీంతో పరశురామ్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్ ఇంట్రస్ట్ చూపించారు.

ఎవరైనా అడ్వాన్స్ ఇస్తామనడమే ఆలస్యం వెంటనే ఓకే అని చెప్పి తీసుకోవడం పరశురామ్ కు అలవాటని చెబుతున్నారు.  దీనివల్ల ఒక హీరోతో సినిమా కమిట్ అయి ఆ తర్వాత తూచ్ అని చెప్పి మరో హీరోతో సినిమా చేస్తుంటాడు. ఇది పరశురామ్ కి  తెచ్చిపెట్టింది.  ఆమధ్య నాగచైతన్యతో మూవీని ప్రకటించిన తర్వాత … దాన్ని పక్కన పెట్టి మహేష్‌ బాబుతో ‘సర్కారు వారి పాట’ చేశాడు. ఇటీవల అల్లు అరవింద్ బ్యానర్ లో సినిమా చేయాల్సింది కానీ.. దిల్ రాజు బ్యానర్ లో సినిమాని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. దీంతో అల్లు అరవింద్ బాగా హర్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి.

ఈ మొత్తం వ్యవహారంలో పరశురామ్ ఎంత మంది దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడు అనేది బయటపడింది. ఇంతకీ ఎవరెవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడంటే.. గీతా ఆర్ట్స్ బేనర్లోనే పరశురామ్ ఇంకో రెండు సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకున్నాడట. అలాగే ఇప్పుడు సినిమా చేయబోతున్న దిల్ రాజుతో ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది. ఇక 14 రీల్స్‌ వాళ్లతో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే సీనియర్ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ దగ్గర పరశురామ్ చాన్నాళ్ల కిందటే అడ్వాన్స్ తీసుకున్నాడట.

అలాగే సురేష్ ప్రొడక్షన్స్‌లో కూడా ఓ సినిమాకు కమిట్మెంట్ ఉందట. ఇంకా మంచు వారికి కూడా ఎప్పుడో ఒక కమిట్మెంట్ ఇచ్చాడట. అంతే కాక కొత్తగా ప్రొడక్షన్ మొదలు పెట్టాలనుకుంటున్నఐడ్రీమ్ సంస్థ అధినేత వాసుదేవరెడ్డి, అల్లు అర్జున్ స్నేహితుడైన కేదార్‌లకు కూడా పరశురామ్ సినిమాకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇంత మంది దగ్గర పరశురామ్ అడ్వాన్సులు తీసుకున్నాడా అని ఇండస్ట్రీ షాక్ అవుతుంది. మరి.. వీళ్లందరితో ఎప్పుడు సినిమాలు చేస్తాడో..? తన పద్దతి మార్చుకోకపోతే.. పరశురామ్ తో సినిమా అంటే.. వద్దు బాబోయ్ అనే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందనే టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *