Saturday, January 18, 2025
Homeసినిమాప‌ర‌శురామ్ కి షాక్ ఇచ్చిన చైతన్య‌

ప‌ర‌శురామ్ కి షాక్ ఇచ్చిన చైతన్య‌

Wait: యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ టీజ‌ర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తుండ‌డంతో థ్యాంక్యూ మూవీ పై ఆడియ‌న్స్ లో మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. జులై 8న థ్యాంక్యూ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది.

ఇదిలా ఉంటే.. డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ తో నాగ‌చైతన్య సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే.. మ‌హేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ రావ‌డంతో ప‌ర‌శురామ్ నాగ‌చైతన్య సినిమాని ప‌క్క‌న‌పెట్టి మ‌హేష్ బాబుతో స‌ర్కారు వారి పాట చేయ‌డం జ‌రిగింది. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స‌ర్కారు వారి పాట స‌క్సెస్ సాధించింది. అయితే.. ఈలోపు నాగ‌చైత‌న్య కొన్ని సినిమాల‌కు ఓకే చెప్పారు. దీంతో ప‌ర‌శురామ్ వెంట‌నే నాగ‌చైత‌న్య‌తో సినిమా చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ.. కుద‌ర‌డం లేదు.

ఇది ఒక ర‌కంగా ప‌ర‌శురామ్ కి షాకే అని చెప్ప‌చ్చు. నాగ‌చైత‌న్య‌తో సినిమా చేయాలంటే దాదాపు సంవ‌త్స‌రం పాటు వెయిట్ చేయాలా. మ‌రి.. ప‌ర‌శురామ్ నాగ‌చైత‌న్య కోసం వెయిట్ చేస్తాడా..?  లేక ఈలోపు వేరే హీరోతో సినిమా చేస్తాడా..? చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్