Saturday, January 18, 2025
Homeసినిమాప్రశాంత్ వర్మ మరో ప్రయోగం

ప్రశాంత్ వర్మ మరో ప్రయోగం

‘అ’ అనే విభిన్న కథా చిత్రాన్ని అందించి.. తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ తో ‘కల్కి’ మూవీని తెరకెక్కించారు. కమర్షియల్ గా ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయినా.. హీరో రాజశేఖర్, దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇద్దరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. మూడవ ప్రయత్నంగా సరికొత్త చిత్రం ‘జాంబిరెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హాలీవుడ్ కి పరిమితమైన ఈ జోనర్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ప్రేక్షకులను మెప్పించి.. మంచి విజయాన్ని సాధించాడు.

ఇలా… వరుసగా విభిన్న కథా చిత్రాలను అందిస్తున్న ప్రశాంత్ వర్మ నాలుగవ సినిమాని కూడా సరికొత్త కథాంశంతో రూపొందించి ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ‘హను –మాన్’ అని ప్రకటించారు. తెలుగులో ఇదే తొలి సూపర్ హీరో సినిమా అని ఎనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఈరోజు త‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా త‌న కొత్త సినిమా వివరాలను అఫిషియల్ గా ఎనౌన్స్ చేశాడు. అయితే.. అందరికీ తెలిసిన హనుమాన్ కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా..? లేక మనకి తెలియని హనుమాన్ కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నారా.? అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి.. ప్రశాంత వర్మ నుంచి వస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం అని తెలుస్తుంది. మరి.. ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్