Sunday, January 19, 2025
Homeసినిమాబాలీవుడ్ కి వెళుతున్న 'బ్రో' కథ!

బాలీవుడ్ కి వెళుతున్న ‘బ్రో’ కథ!

సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్ – సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మంచి ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. వీకెండ్ లో తన జోరును పెంచుతూ వెళ్లింది. పవన్ కల్యాణ్ ఇంతవరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అనే చెప్పాలి. అది కథా పరంగా కావొచ్చు .. బడ్జెట్ పరంగా కావొచ్చు .. షూటింగు జరిగిన వర్కింగ్ డేట్స్ పరంగా కావొచ్చు. కానీ పవన్ అభిమానుల అంచనాలను అందుకోవడంలో సముద్రఖని సక్సెస్ అయ్యాడు. థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్ నిరుత్సాహ పడకుండా చూసుకున్నాడు.

నిజానికి తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో కొంతకాలం క్రితం వచ్చిన ‘వినోదయా సితం’ సినిమాకి ఇది రీమేక్. అక్కడ సముద్రఖని చేసిన పాత్రనే ఇక్కడ పవన్ కల్యాణ్ చేశాడు. అక్కడ సముద్రఖని మంచి దర్శకుడు .. నటుడు. కానీ ఇక్కడ పవన్ కి ఉన్న క్రేజ్ వేరు .. ఆయనకి ఉన్న మార్కెట్ వేరు. అలాంటి ఒక కథను పవన్ తో చేసి మెప్పించడం అంత తేలిక కాదు. కానీ సముద్రఖని తెలివైనవాడు .. అందువల్లనే అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఈ కథను డిజైన్ చేసుకున్నాడు.

పవన్ కల్యాణ్ కి ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెట్టింది. ఇక వసూళ్ల పరంగా చూసుకుంటే, ఈ మధ్య ఆయన నుంచి వచ్చిన రెండు సినిమాలకు మించి రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కథను బాలీవుడ్ హీరోలతో చేయడానికి సముద్రఖని రెడీ అవుతున్నాడు. రీసెంటుగా ఒక ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా ఈ విషయం చెప్పాడు. దాంతో పవన్ ఇక్కడ చేసిన రోల్ ను బాలీవుడ్ లో ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. చాలా తక్కువ బడ్జెట్ లోనే చేయగల కంటెంట్ ఇది. అందువలన సముద్రఖని ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉండకపోవచ్చునేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్