Sunday, January 19, 2025
Homeసినిమా'బ్రో' 70 రోజులు చేయాల్సిన పనిని 20 రోజుల్లో చేశాను: దర్శకుడు సముద్రఖని

‘బ్రో’ 70 రోజులు చేయాల్సిన పనిని 20 రోజుల్లో చేశాను: దర్శకుడు సముద్రఖని

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

చిత్ర దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ.. “ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి, చెన్నై వచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి బ్రో సినిమా చేశాను. నాకు టైం వచ్చింది కాబట్టే ఇది సాధ్యమైంది. నేనేది ప్లాన్ చేయలేదు, అదే జరిగింది. మన పని మనం చేస్తుంటే మన టైం వస్తుంది. నేను ఒకసారి త్రివిక్రమ్ అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు నాకొక ఫోన్ కాల్ వచ్చింది. నేను చేసిన సినిమా విడుదలై పది రోజులు అవుతుంది. ఒక 73 ఏళ్ళ పెద్దాయన సినిమా చూసి బాగా ఎమోషనల్ అయ్యి నాకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పాను. అన్నయ్య కథ చెప్పమంటే ఒక పది నిమిషాల్లో చెప్పాను. ఆయనకు కథ నచ్చి, పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుంది అన్నారు. అప్పుడు త్రివిక్రమ్ అన్నయ్య రూపంలో నేను టైంని చూశాను.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో ఇలా చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. అప్పటినుంచి ఏడాదిన్నర ఈ సినిమా పని మీదే ఉన్నాను. ఎప్పుడూ ఒక్క శాతం కూడా నమ్మకం కోల్పోలేదు. టైం కోసం ఎదురుచూశాను. టైం వచ్చింది. టైం(పవన్ కళ్యాణ్)ని కలిశాను. ఆయనను కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు. మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే ఆయనొక చిరునవ్వు నవ్వారు. దానిని మర్చిపోలేను. 70 రోజులు చేయాల్సిన పనిని 20 రోజుల్లో చేశాను. అంత పవర్ ఉంది, అంత ఎనర్జీ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడం అదృష్టం. సోదరుడు తేజ్ తో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్