Saturday, January 18, 2025
Homeసినిమాచ‌ర‌ణ్ తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్న శంక‌ర్?

చ‌ర‌ణ్ తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్న శంక‌ర్?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్  ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. శంక‌ర్ తెలుగులో చేస్తున్న ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ మూవీని వ‌చ్చే స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతోన్న ఈ మూవీ పై చ‌ర‌ణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. చ‌ర‌ణ్ తో శంక‌ర్.. ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడ‌ని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.  కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయాల్సి ఉండగా ఆ తర్వాత హిందీలో ‘అపరిచితుడు 2’ రణ్ వీర్ సింగ్ తో చేయాల్సి ఉంది. ఇక ఈ కమిట్మెంట్స్ పూర్తైన త‌ర్వాత‌ రామ్ చరణ్ తో 1000 కోట్ల‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడ‌ట శంక‌ర్. అందులో హృతిక్ రోషన్ మరొక హీరోగా కనిపిస్తాడట.

ఆ సినిమా సైన్స్ ఫిక్షన్ తరహాలో ఎక్కువ భాగం అండర్ వాటర్ కాన్సెప్ట్ లో ఉంటుందని తమిళ మీడియాలో అయితే జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక రాంచరణ్ తో అయితే శంకర్ మరొక ప్రాజెక్టు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు పక్కాగా సమాచారం అందుతోంది కానీ.. ఏ ప్రాజెక్ట్ అనేది మాత్రం క్లారిటీ లేదు. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై శంక‌ర్ కానీ, చ‌ర‌ణ్ కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్