Sunday, January 19, 2025
Homeసినిమాసుకుమార్ లైనప్ మామూలుగా లేదుగా!

సుకుమార్ లైనప్ మామూలుగా లేదుగా!

‘పుష్ప’తో సంచలనం సృష్టించి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు సుకుమార్. ఈ సినిమా టాలీవుడ్ కన్నా ఎక్కువుగా బాలీవుడ్ ని షేక్ చేసింది. దీంతో సుకుమార్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ సైతం ఇంట్రస్ట్ చూపించారు. అయితే.. సుకుమార్ మాత్రం తన దృష్టి అంతా పుష్ప 2 పైనే ఉందని.. ఆతర్వాత చెబుతానని బాలీవుడ్ ఆఫర్స్ ని సున్నతంగా తిరస్కరించారు. ఇటీవల పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేశారు.

ఇదిలా ఉంటే.. సుకుమార్ మరో పదేళ్ల వరకు ఖాళీ లేడు. తన లైనప్ అంత స్ట్రాంగ్ గా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ సుకుమార్ లైనప్ ఏంటంటే.. ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వడానికి ఎంతలేదన్నా రెండు సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలి. ఇది కూడా కనీసం రెండేళ్ల ప్రాజెక్ట్. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ఓపెనింగ్ సీన్ ఎలా ఉంటుందో సుకుమార్ చరణ్‌ కి చెప్పాడు. అలాగే రాజమౌళికి చెప్పాడు. ఈ సీన్ విని ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని రాజమౌళి సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి బయటపెట్టారు.

అలాగే ప్రభాస్ తో కూడా సుకుమార్ ఓ సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి వార్తలు రావడం.. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ చేయాలి అనుకుంటున్న అభిషేక్ అగర్వాల్ ఈ వార్తను ఖండించడం జరిగింది కానీ.. ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని సమాచారం. ఈ సినిమా కూడా రెండేళ్ల ప్రాజెక్ట్. ఈ సినిమా అవ్వగానే పుష్ప 3 చేయాలి అనుకుంటున్నారు. ఈ సినిమా కి సంబంధించిన ఐడియా ఈమధ్య పుట్టింది. ఈ లైన్‌ కూడా బ‌న్నీకి చెప్పేశాడు సుకుమార్‌. చ‌ర‌ణ్‌, ప్రభాస్‌, పుష్ప 3… సినిమాకి రెండేళ్లు వేసుకొన్నా… ఈ మూడు సినిమాల‌కే ఆరేళ్లు ప‌డుతుంది. సినిమా సినిమాకీ మ‌ధ్య గ్యాప్‌లు కూడా క‌లుపుకొంటే… ప‌దేళ్ల వ‌ర‌కూ సుకుమార్ మ‌రే సినిమా చేయ‌డు. ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి అనుకుంటే స్పీడు పెంచాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్