Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప ... ఇంకా చాలా ఉంది....

పుష్ప … ఇంకా చాలా ఉంది….

Pushpa 3 Also: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ పుష్ప. ఈ చిత్రం టాలీవుడ్ లో మాత్ర‌మే కాదు.. బాలీవుడ్ లో సైతం సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అక్క‌డ 100 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసింది. దీంతో పుష్ప 2 సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈపాటికే పుష్ప పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ కావాల్సింది కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆల‌స్యం అయ్యింది. పుష్ప 2 సినిమాకి సంబంధించిన కథా చర్చలు తమిళనాడులోని కూనూర్ లో జరపడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

అంత‌కు మించి అనేలా పుష్ప 2 చిత్రాన్ని ర‌స‌వ‌త్త‌రంగా ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఇంకా పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ కాలేదు.. పుష్ప 3 కూడా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మేట‌ర్ ఏంటంటే.. సుకుమార్ పుష్ప 2 తోనే ఆపేయాల‌ని అనుకోవ‌డం లేద‌ట‌. పుష్ప 3 కూడా తీయాల‌ని అనుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. పుష్ప 3 వాస్త‌వ‌మేనా.?  కాదా..?  అనేది తెలియాల్సివుంది.

Also Read : పుష్ప 2 ప్లాన్ మారిందా?  

RELATED ARTICLES

Most Popular

న్యూస్