Saturday, January 18, 2025
Homeసినిమానదికి ఆవలితీరంలో దెయ్యం .. ఉత్కంఠను పెంచుతున్న 'బాక్' 

నదికి ఆవలితీరంలో దెయ్యం .. ఉత్కంఠను పెంచుతున్న ‘బాక్’ 

తమిళంలో లారెన్స్ తరువాత ఆ స్థాయిలో హారర్ కామెడీ కంటెంట్ ను టచ్ చేసే దర్శకుడిగా సుందర్ సి. కనిపిస్తాడు. ‘అరణ్మణై’ సిరీస్ లో భాగంగా ఆయన ఒకదాని తరువాత ఒకటిగా ఒక్కో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఇంతవరకూ ఈ సిరీస్ లో భాగంగా 3 సినిమాలు వచ్చాయి. వాటిలో తెలుగులోకి అనువాదమైన ‘చంద్రకళ’ .. ‘కళావతి’ సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలు ఇక్కడ మంచి వసూళ్లను రాబట్టాయి.

ఈ నేపథ్యంలో తమిళంలో ‘అరణ్మణై 4’ రూపొందింది. ప్రధానమైన పాత్రలలో తమన్నా – రాశి ఖన్నా కనిపించనున్నారు. తెలుగులో ఈ సినిమాకి ‘బాక్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ తో ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలెట్టారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్ .. సాంగ్స్ కి మంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ నెల 26వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన మే 3వ తేదీకి వాయిదా వేసుకున్నారు.

మే 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ కథ ఆంగ్లేయుల కాలాన్ని టచ్ చేస్తూ .. బ్రహ్మపుత్ర నది నేపథ్యంలో నడుస్తుంది. బ్రహ్మపుత్ర నదికి అవతల ప్రాంతంలో ఒక దెయ్యం తిరుగుతూ ఉంటుందని అక్కడి వాళ్లు నమ్ముతూ ఉంటారు. అందువల్లనే ఆ నదికి అవతల ప్రాంతాన్ని ఎవరూ ఆక్రమించడానికి ప్రయత్నించలేదనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. ఆ దెయ్యానికి అంతా కలిసి పెట్టుకున్న పేరే ‘బాక్’. ఈ అంశం చుట్టూనే ఈ కథ ఉత్కంఠను పెంచనుంది. చూడాలి మరి ఈ సినిమా ఇక్కడ ఏ స్థాయిలో భయపెడుతుందో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్