Tuesday, September 24, 2024
Homeసినిమామెగా హీరోతో సురేందర్ రెడ్డి సినిమా?

మెగా హీరోతో సురేందర్ రెడ్డి సినిమా?

అక్కినేని అఖిల్ తో డైరక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’ డిజాస్టర్ గా నిలిచింది. దీని  తర్వాత అఖిల్ యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది మాత్రం ప్రకటించ లేదు. ఆ మధ్య అల్లు అర్జున్ తో సురేందర్ రెడ్డి సినిమా అంటూ ప్రచారం జరిగింది. అయితే.. బన్నీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో…. తదుపరి  సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేయనున్నారు. అందుచేత బన్నీతో సినిమా ఇప్పట్లో కుదరదు కాబట్టి వేరే హీరోతో సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అది కూడా మెగా హీరోతోనే  అని టాక్.  ఈ హీరో ఉప్పెన  వైష్ణవ్ తేజ్ అని తెలిసింది.

ఇటీవల సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీకి వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించనున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ఆదికేశవ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల కథానాయిక. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆతర్వాత వైష్ణవ్ తేజ్, సురేందర్ రెడ్డి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్