నాగార్జునతో సినిమా విషయంలో పెద్ద తప్పు చేశానంటున్నారు ఓ డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఎస్వీ కృష్ణారెడ్డి. ఇంతకీ విషయం ఏంటంటే.. నాగార్జున హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో ‘వజ్రం’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. తండ్రీకొడుకుల మధ్య జరిగే మాస్ ఫ్యామిలీ స్టోరీగా రూపొందిన వజ్రం చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఎస్వీ కృష్ణారెడ్డి బాలకృష్ణతో తీసిన టాప్ హీరో కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దీంతో ఎస్వీ కృష్ణారెడ్డికి స్టార్ హీరోలతో సక్సెస్ ఫుల్ మూవీ తీయలేడు అనే పేరు వచ్చింది. అంతే… మిగిలిన స్టార్ హీరోలు ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపించలేదు.
ఎస్వీ కృష్ణారెడ్డి చాలా గ్యాప్ తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో వజ్రం సినిమా వెనుక ఏం జరిగిందో ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడు బయటపెట్టారు. ఆయన ఏం చెప్పారంటే.. నాగార్జునకు ముందుగా రాకుమారుడు అనే జానపద కథ చెప్పారట. ఈ కథ నాగార్జునకు బాగా నచ్చడంతో వెంటనే చేయాలి అనుకున్నారట. అయితే.. నిర్మాత నరసారెడ్డి మాత్రం ఒప్పుకోలేదట. రాకుమారుడు సినిమాకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది. టేబుల్ ప్రాఫిట్ ఉంటే తప్పా సినిమా చేయనన్నారట.
దీంతో ఆయన కోసం నాగార్జున, కృష్ణారెడ్డి బెండ్ అవ్వాల్సి వచ్చిందట. మలయాళం మూవీ స్పటికం రీమేక్ రైట్స్ తీసుకుని వజ్రం అనే సినిమా చేశానని… ఇది మొట్టమొదటి తప్పు. తన కెరీర్ లోనే పెద్ద తప్పు ఇది. కెరీర్ లో చేసిన ఆ అతిపెద్ద తప్పు వల్ల చాలా పెద్ద రిమార్క్ పడింది. పెద్ద హీరోలను కృష్ణారెడ్డి హ్యాండిల్ చేయలేరనే అపవాదను ఎదుర్కొన్నాను. కేవలం ఆ అనుమానాలతోనే చిరంజీవి, వెంకటేష్ తనకు అవకాశాలివ్వలేదని బాధపడ్డారు కృష్ణారెడ్డి. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ అందుకున్నారు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా తీశారు. మరి.. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వస్తారో లేదో.