Sunday, January 19, 2025
Homeసినిమాచైతూ కస్టడీ సీక్వెల్ ఉందా..?

చైతూ కస్టడీ సీక్వెల్ ఉందా..?

నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ లో తెరకెక్కిన కస్టడీ చిత్రాన్ని మే 12న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇందులో చైతన్యకు జంటగా కృతి శెట్టి నటించింది. చైతన్య కెరీర్ లో భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. థ్యాంక్యూ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇటీవల అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ ప్లాప్ అయ్యింది. దీంతో అక్కినేని అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. ఇలాంటి టైమ్ లో చైతన్య ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి.

అయితే.. కస్టడీ సినిమా పై చైతన్య చాలా నమ్మకంగా ఉన్నాడు. సినిమా కథ విన్నప్పుడే ఇది హిట్ సినిమా అనే ఫీలింగ్ కలిగిందన్నాడు. నన్ను నమ్మండి.. థియేటర్లో బ్లాస్ట్ అవుతుంది అంటూ సక్సస్ పై తనకున్న నమ్మకాన్ని తెలియచేశాడు. ఇక వెంకట్ ప్రభు అయితే.. ‘కస్టడీ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగులోనే మాట్లాడతానని చెప్పాడు. దీనిని బట్టి కస్టడీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని.. కస్టడీకి సీక్వెల్ గా కస్టడీ 2 కూడా ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇలా నాగచైతన్య, వెంకట్ ప్రభు సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను పెంచేశారు. మరి.. కస్టడీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో..? ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్