Sunday, January 19, 2025
Homeసినిమావిజయ్ భాస్కర్ బ్యాక్ విత్ 'జిలేబి'

విజయ్ భాస్కర్ బ్యాక్ విత్ ‘జిలేబి’

‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘మన్మధుడు’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన  డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ చాలా విరామం తర్వాత తెరకెక్కించిన యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ  చిత్రాన్ని నిర్మించారు. అంజు అశ్రాని చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీ కమల్ హీరోగా పరిచమైన ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆగస్ట్ 18న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపద్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

కె. విజ‌య‌భాస్కర్ మాట్లాడుతూ  “ఇంత మంచి ఫన్ ఎంటర్ టైనర్ ని ఎంచుకొని, ఎక్కడా రాజీపడకుండా ఒక పెద్ద సినిమాలా నిర్మించిన నిర్మాతలు రామకృష్ణ, అంజుఅశ్రాని కి ధన్యవాదాలు. సినిమా పై వున్న నమ్మకంతో సొంతగా రిలీజ్ చేశారు. సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం ప్రొడక్షన్ లా ఎక్కడా అనిపించదు. ‘జిలేబి’ సినిమా చదువుకునే రోజులు, హాస్టల్ డేస్ ని మళ్ళీ గుర్తుకు తెచ్చింది. ప్రతి సినిమా ఒక పరీక్ష లాంటిదే. ఐతే చదువుకునే రోజుల్లో పరీక్ష ఒత్తిడితో రాసేవాళ్ళం. ఇక్కడ మాత్రం ఎంజాయ్ చేస్తూ రాస్తాం.  సినిమాలో వినోదం ఎలా వుందో ప్రేక్షకులు చూసి చెప్పాలి. శ్రీకమల్, శివానితో పాటు నటీనటులంతా చక్కగా నటించారు. రాజేంద్రప్రసాద్ గారు, మురళీశర్మ వారి అనుభవాన్ని జోడించారు. మణిశర్మ చక్కని సంగీతం అందించారు. రామజోగయ్యశాస్త్రీ గారి లిరిక్స్ హైలెట్. అలాగే భాను అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. అందరూ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. కమల్ ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టాడు. ఇంకా మీ ప్రేమ కావాలి. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని ప్రామిస్ చేయగలం. సినిమా చూసిన తర్వాత మీ ఫీడ్ బ్యాక్ ని ఇవ్వండి” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్