ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై రెండురోజులపాటు తెలంగాణ చింతన్ శిబిర్ లో చర్చిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు హైదరాబాద్ లో వెల్లడించారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని అంశాలను పొందుపర్చి ఏఐసీసీ కి నివేధిస్తామన్నారు. చింతన్ శిబిర్ లో 6అంశాలపై చర్చ వుంటుందని, ఈ 6 అంశాలలో రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాలు ప్రతిబింబిస్తాయన్నారు.
చింతన్ శిబిరంలో తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకి రోడ్ మ్యాప్ మాదిరిగా ఉపయోగపడతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జిల్లాల వారిగా కూడా చింతన్ శిబిర్ నిర్వహిస్తామన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ని జనంలోకి తీసుకెళ్లడం కోసమే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ఉండడం వల్లనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చింతన్ శిబిర్ కు హాజరు కావటం లేదని, రేవంత్ రెడ్డి రాకపోవడంలో ఎలాంటి వివాదం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.