Saturday, January 18, 2025
Homeసినిమాదిశా పటాని ఎందుకొచ్చినట్టు .. ఎందుకు పోయినట్టు?

దిశా పటాని ఎందుకొచ్చినట్టు .. ఎందుకు పోయినట్టు?

దిశా పటాని .. యూత్ లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. నాజూకు భామగా కుర్రకారు ఈ బ్యూటీని అదేపనిగా ఆరాధిస్తూ ఉంటారు. తెరపై అందాలు ప్రదర్శించడంలో ఆమెకి పెద్దగా మొహమాటాలు లేవు. అందువలన ఆమెకి ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. సినిమాకి .. సినిమాకి మధ్యలో కూడా ఆమె ఖాళీగా ఏమీ కూర్చోదు. సోషల్ మీడియాలో అందాల సందడి చేస్తూనే ఉంటుంది.

అలాంటి దిశా .. ‘కల్కి’ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం పట్ల ఆమె అభిమానులు తెగసంబరపడిపోయారు. ఈ సినిమా తరువాత ఆమె డేట్స్ దొరకడం కష్టం కావొచ్చునని అనుకున్నారు. ప్రభాస్ తో డ్యూయెట్లు .. రొమాన్స్ ను ఊహించుకుని ఉత్సాహపడ్డారు. నిన్న ఈ సినిమా  విడుదల కావడంతో, పొలోమంటూ ఆమె అభిమానులు థియేటర్లకి వెళ్లారు. అందరూ ఊహించినట్టుగానే దిశా తెరపైకి వచ్చింది. ఊహించనంత వేగంగానూ వెళ్లిపోయింది.

దిశా పాటని ఎంట్రీతో ఇక కథలో రొమాన్స్ పాళ్లు కలుస్తాయని ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు. ఆమె గ్లామర్ ధాటిని తట్టుకోవడానికి రెడీ అయ్యారు. దిశా తెరపైకి వచ్చింది .. ఒక పాటేసుకుని .. దీనితో సరిపెట్టుకోండి అన్నట్టుగా మాయమైపోయింది. మళ్లీ వస్తుందేమోనని సినిమా పూర్తయ్యేవరకూ అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. సాధారణ ప్రేక్షకులు మాత్రం ఆమె పాత్ర ఒకటి ఉందనే విషయం కూడా మరిచిపోయారు .. పాపం దిశా పటాని.

RELATED ARTICLES

Most Popular

న్యూస్