Monday, February 24, 2025
HomeTrending NewsWaste Lands : 30 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ

Waste Lands : 30 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ

రాష్ట్రంలో ఈ నెల (జూన్) 30 వ తేదీనుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లా నుండి అదేరోజు (జూన్ 30) న సిఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

మంత్రులు ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు.

ఈ నెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాలచేత ఈనెల 30 తేదికి మార్చవలసి వచ్చింది.

జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి నిన్న ఇవ్వాల జిల్లా కలెక్టర్లకు శిక్షణాతరగుతులు నిర్వహస్తుండడం, అదే సందర్భంలో ఈ నెల 29 న బక్రీద్ పండుగ కూడా వుండడం…వీటన్నిటి నేపథ్యంలో ప్రకటించిన కార్యక్రమాన్నిజూన్ 30 కి మార్చడం జరిగింది.

అదే రోజు (జూన్ 30) నాడు నూతనంగా నిర్మితమైన అసిఫాబాద్ జిల్లా కలక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్