Sunday, January 19, 2025
Homeసినిమా'టక్కర్'తో టచ్ లోకి వచ్చిన బ్యూటీ!

‘టక్కర్’తో టచ్ లోకి వచ్చిన బ్యూటీ!

సాధారణంగా టాలీవుడ్ కి బాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి ఎక్కువమంది  భామలు పరిచయమవుతూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి వచ్చే ముద్దుగుమ్మల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే ఢిల్లీ నుంచి రంగంలోకి దిగిన బ్యూటీలు మాత్రం చాలా తక్కువమంది కనిపిస్తుంటారు. అక్కడి మోడలింగ్ నుంచి వచ్చినవారే ఎక్కువగా కనిపిస్తారు. అలా ఢిల్లీ నుంచి టాలీవుడ్ కి దిగిపోయిన అందగత్తెలలో దివ్యాన్ష కౌశిక్ ఒకరుగా కనిపిస్తుంది.

దివ్యాన్ష కౌశిక్ టాలీవుడ్ కి ‘మజిలీ’ సినిమాతో పరిచయమైంది. ఆ సినిమాలో చైతూ – సమంత తరువాత ప్రధానమైన పాత్రలో దివ్యాన్ష కౌశిక్ కనిపించింది. చక్కని కనుముక్కు తీరుతో ఉన్న చందమామ లాంటి ఈ పిల్ల ఎవరబ్బా అని కుర్రాళ్లంతా ఆలోచనలో పడ్డారు. మొదటి సినిమానే అయినా నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా హిట్ కొట్టినప్పటికీ, ఆ క్రెడిట్ సమంత ఖాతాలో పడిపోవడం దివ్యాన్ష చేసుకున్న దురదృష్టం.

ఇక ఆ తరువాత రవితేజ సరసన ‘రామారావు ఆన్ డ్యూటీ’ .. సందీప్ కిషన్ జోడీగా ‘మైఖేల్’ చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ రెండు సినిమాల ఫలితం ఆమెను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ జోడీగా ఆమె చేసిన ‘టక్కర్’ సినిమా, ఈ నెల 9వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారనే విషయం తెలుస్తోంది. రొమాన్స్ పాళ్లు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమా అయినా ఆమెకి హిట్ తెచ్చిపెడితే, కెరియర్ గ్రాఫ్ పుంజుకునే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్