Friday, February 21, 2025
Homeసినిమాగ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న‌ సిద్దు జొన్నలగడ్డ, నేహశెట్టి

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న‌ సిద్దు జొన్నలగడ్డ, నేహశెట్టి

Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రశాసన్ నగర్ జిహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు సినీ నటుడు సిద్దు, నటి నేహశెట్టి. ఈ సందర్భంగా సిద్దు, నేహశెట్టి మాట్లాడుతూ… “ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ బాగస్వామ్యులను చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది” అన్నారు.

అనంతరం సిద్దు తన స్నేహితులు ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక, మీనాక్షి చౌదరికి ఛాలెంజ్ కు నానినేట్ చేయగా, నేహశెట్టి డైరెక్టర్ విమల్ కృష్ణ, నిర్మాత నాగవంశీ, నటుడు ప్రిన్స్ కి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఇచ్చారు.

Also Read : గ్రీన్ ఇండియా చాలెంజ్ లో రాధిక, సాయికుమార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్