Sunday, November 24, 2024
HomeTrending Newsబైజూస్ తో 1456 కోట్లు వృథా: డిఎల్ ఆరోపణ

బైజూస్ తో 1456 కోట్లు వృథా: డిఎల్ ఆరోపణ

వచ్చే ఎనికల్లో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నట్లు మాజీమంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. తాను గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నానని వెల్లడించారు.  ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప మరో నేత కాపాడలేరన్న డిఎల్ పవన్ కల్యాణ్ నిజాయతీని ప్రశ్నించలేమని, కానీ ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని అభిప్రాయపడ్డారు.  తాను ప్రస్తుతానికి వైసీపీలోనే ఉన్నానని, వారు నన్ను తొలగించలేదని అన్నారు. ఆ  పార్టీలోఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందన్నారు.  ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు.

బైజూస్ కంపెనీ దివాలా అంచున ఉందని, ఏపీ ప్రభుత్వం ఒప్పందం ద్వారా కొంత డబ్బులు సంపాదించి పబ్లిక్ ఇష్యూకు వెళ్ళాలని అనుకుంటున్నారని డిఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీచర్లపై కోపంతో బైజూస్ కంటెంట్ ట్యాబ్ లు పంపిణీ చేస్తున్నారని, ఈ కంటెంట్ ను కేరళ బ్యాన్ చేసిందని, కర్నాటక వద్దని చెప్పిందని, ప్రమాణాలకు అనుగుణంగా లేదని రాజస్థాన్ తిరస్కరించిందని…. అలాంటి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం ఏమిటని డిఎల్ ప్రశ్నించారు. ఈ ఒప్పందం వెనుక కడప జిల్లాకు చెందిన ఇద్దరి ప్రమేయం ఉందని ఆరోపించారు. బైజూస్ లో వచ్చే కంటెంట్ లో కంటే మన టీచర్ల దగ్గర ఇంకా ఎక్కువ సబ్జెక్ట్, కంటెంట్  ఉన్నాయని చెప్పారు. ఈ ఒప్పందంతో 1456 కోట్ల రూపాయలను వృథా చేస్తున్నారని మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్