Tuesday, September 17, 2024
HomeTrending NewsFCI Rules: తెలంగాణ రైతులు దేశంలో భాగం కాదా - మంత్రి గంగుల

FCI Rules: తెలంగాణ రైతులు దేశంలో భాగం కాదా – మంత్రి గంగుల

రాష్ట్ర ప్రజలు కట్టే జీఎస్టీ పన్నులతో కేంద్రం ఎంజాయ్ చేయొచ్చు కానీ అదే ప్రజలు, రైతులు కష్టాల్లో ఉంటే కేంద్రం సహకరించకపోవడం దారుణమన్నారు, తెలంగాణ ప్రజలు దేశంలో బాగం కాదా అని కేంద్రాన్ని, గవర్నర్ని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్. విపత్కర పరిస్థితుల్లో గవర్నర్, కేంద్ర మంత్రులు, ఎంపీలు చేయాల్సింది రాజకీయాలు కాదని రాష్ట్ర ప్రజలకు, రైతులకు మద్దతుగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని హితవు ఫలికారు, ధాన్యం కొనుగోళ్లు నిర్వహించే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ కార్పోరేషన్ ఆప్ ఇండియా నిభందనలు సడలించాలని డిమాండ్ చేసారు. అందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు, నేడు కల్లాల్లో తడిసిన ధాన్యంతో 67 కిలోల ఔటర్న్ రాదని, రైతులకు అండగా ఉండడం కోసం దీన్ని 50 కిలోలకు తగ్గించాలని డిమాండ్ చేసారు మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో రైతుల పంట పొలాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి ఆవేదన వెలిబుచ్చారు.

కేంద్ర ప్రభుత్వం నియమిస్తే గవర్నర్ రాష్ట్రానికి వచ్చారని, ఈ క్లిష్ట సమయంలో గవర్నర్ సైతం బాధ్యత తీసుకోవాలని, ఎఫ్.సి.ఐ అధికారులను పిలిచి కేంద్రంపై ఒత్తిడి పెంచి రైతుల్ని ఆదుకోవడంలో కలిసి రావాలన్నారు. అవసరమైతే కల్లాల వద్దకు రావాలని, తాము సైతం పరిస్థితులను వివరిస్తామన్నారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని, తెలంగాణ రైతు ఇబ్బందులు తొలిగించమని ఎక్కని కొండ, తొక్కని బండ లేదన్నారు. ఈ సమయంలో రైతులకు అండగా రాష్ట్ర సర్కారుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కేసీఆర్ రైతులకు అండగా నష్టపరిహారం పదివేలు ప్రకటించారని దానికి అధనంగా కేంద్రం మరో 20 వేలు ప్రకటించాలని, కేసీఆర్ తడిసిన ధాన్యం కొంటామన్నారు, మీరు నిబందనలు సడలించండి, రైస్ మిల్లర్లను, ఎఫ్.సి.ఐ అధికారులను పిలిచి ఔటర్న్ పై నిర్ణయం తీసుకోండి 67 కిలోల నుండి ఎంత తగ్గిస్తారో చెప్పండి అని కేంద్రాన్ని డిమాండ్ చేసారు.

రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో గవర్నర్ గారు ప్రభుత్వంలో బాగస్వామి అయి రాజకీయాలు మాట్లాడడం బాధాకరం అన్నారు మంత్రి గంగుల కమలాకర్. రాజ్ భవన్ ప్రగతీభవన్ ఎంత దూరం, కేసీఆర్ గారు అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదు అని అసందర్భ పిర్యాదులు ప్రధానికి చేయడం కాదని, నిజానికి తెలంగాణ రైతుల పక్షాన గవర్నర్ ఉన్నారు అనుకుంటే అదే మోడీకి తెలంగాణ రైతాంగం అకాల వర్షాలతో జరుగుతున్న నష్టంపై, ఎప్.సి.ఐ నిబందనలను సవరించమని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి అధనంగా కేంద్రం మరో 20వేలు ఇవ్వాలని ధరఖాస్తు ఇవ్వాల్సిన గవర్నర్ బాధ్యతను గుర్తు చేసారు మంత్రి గంగుల. తెలంగాణ రైతులు, ప్రజలు భారతదేశంలో బాగస్వాములు కారా అని ప్రశ్నించారు. 43లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రంలో రైతులను ఆదుకునేందుకు డబ్బులు లేవా లేక కేంద్ర పెద్దలకు మనసు లేదా అని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్