Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్ పుట్టిన‌రోజున ఫ్యాన్స్ కి డ‌బుల్ ట్రీట్

ప్ర‌భాస్ పుట్టిన‌రోజున ఫ్యాన్స్ కి డ‌బుల్ ట్రీట్

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.’ ఆదిపురుష్‌’, ‘స‌లార్’, ‘ప్రాజెక్ట్ కే’, మారుతితో సినిమా చేస్తున్నారు. ఇటీవ‌ల మారుతితో మూవీని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. రామాయ‌ణం ఆధారంగా రూపొందుతోన్న ఆదిపురుష్ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల ఆదిపురుష్ టీజ‌ర్ రిలీజ్ చేవారు. ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌నున్నారు.

అలానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ‘స‌లార్‘ సినిమాలో న‌టిస్తున్నాడు. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీని వ‌చ్చే సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేయ‌నున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో చేస్తున్న ప్రాజెక్ట్ కే మూవీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 2024లో విడుద‌ల చేయ‌నున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మొత్తం రెండు సర్ప్రైజ్ లు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ముందుగా ఆదిపురుష్ నుండి ఆ రోజున ఒక సర్ప్రైజ్ ఉండబోతుంద‌ట‌. అలానే సలార్ టీమ్ నుండి కూడా ఒక ట్రీట్ రానుందట. ఈ విధంగా ప్రభాస్ పుట్టిన‌రోజున‌ మొత్తం రెండు అప్ డేట్స్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించనున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్