సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవ్ కట్టా కాంబినేషన్‌లో రూపొందుతోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. జూన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం పై ఈ చిత్రాన్నినిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
సినిమా ప్రమోషన్స్ లో సాయి తేజ్ పాల్గొనే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడనున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో ముందుగా ప్రకటించినట్టుగా అక్టోబర్ 1న ‘రిపబ్లిక్’ రిలీజ్ అవుతుందా..? లేక వాయిదా పడుతుందా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం రిపబ్లిక్ రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పులేదని.. అక్టోబర్ 1న థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దేవకట్టా ప్రమోషన్స్ బాధ్యతలు తీసుకోనున్నారని, జగపతి బాబు, రమ్యకృష్ణ కూడా దీనిలో పాల్గొంటారని తెలిసింది.