Saturday, November 23, 2024
HomeTrending Newsఉక్రెయిన్ పతనం

ఉక్రెయిన్ పతనం

down fall of ukraine :

దేశ భక్తి లేని నాయకులు అవినీతి పరులు అధికారంలోకి వస్తే ఆ దేశం నాశనం ఎలా అవుతుందో ఉక్రెయిన్ ఒక ఉదాహరణ.
1991 లో సోవియట్ యూనియన్ పతనం అయ్యింది. అయితే అప్పటికే ఆఫ్ఘనిస్థాన్ లో 10 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి తన అనుకూల అధ్యక్షుడికి అండగా ఉండడం కోసం కానీ దాని కోసం తన డబ్బుని చాల పెద్ద మొత్తంలోనే రష్యా ఖర్చు చేసింది. ఫలితంగా ఆర్ధికంగా బలహీనపడింది. అప్పటికి సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ సోషలిస్ట్ విధానానికి స్వస్తి చెప్పి కాపిటలిజానికి తెర తీసే క్రమంలో ‘గ్లాసనోస్త్ ‘ ‘పెరిస్త్రోయిక ‘ పేర్లతో నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టాడు. అది కాస్తా సోవియట్ విచ్చిన్నానికి దారి తీసింది. అప్పటి వరకు కలిసి ఉన్న సోవియట్ రిపబ్లిక్ లు విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. అలా విశాలమైన రష్యా ముక్కలు అయినా పెద్ద దేశంగానే రష్యా అవతరించింది. భాగ పంపిణీలు అయిపోగా రష్యా చాల పేదరికంలోకి వెళ్లిపోయింది.
ఆఫ్ఘనిస్థాన్ లో ఎదో సాధిద్దామని వెళ్ళిన సోవియట్ పతనం అయిపొయింది. రష్యా తిరిగి వచ్చాక ఇప్పుడు 20 ఏళ్ళు ఆఫ్ఘనిస్థాన్ లో తన సైన్యాన్ని మొహరించి తిరిగి వెళ్ళిపోయిన అమెరికా కూడా ఆర్ధికంగా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లుతున్నది.
సోవియట్ విచ్చిన్నం తరువాత భాగ పంపణీలో భాగంగా రష్యా క్రిమియా ద్వీపకల్పాన్ని తిరిగి తమకి ఇచ్చేయమని అడిగింది. మధ్యవర్తిత్వం పేరుతొ అమెరికా,బ్రిటన్ లు కలిసి రష్యా ఉక్రెయిన్ ల మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చాయి. క్రిమియాని రష్యా అడగడానికి కారణం అక్కడ మెజారిటీ ప్రజలు రష్యా సంతతి వారు,రష్యన్ భాషనే మాట్లాడుతారు. అది ఒకప్పుడు రష్యా రిపబ్లిక్ లో భాగంగా ఉండేది. కానీ అమెరికా,బ్రిటన్ లు కలిసి క్రిమియా ఉక్రెయిన్ లోనే ఉంటుందనీ.. దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని నచ్చ చెప్పి ఒప్పందాన్ని అమలులోకి తెచ్చాయి. రష్యా అప్పుడు తీవ్ర పేదరికంలో ఉండడం వలన దానికోసం యుద్ధం చేసే స్థితిలో లేక ఒప్పుకుంది.
1995 సంవత్సరంలో అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా,EU ల డబ్బుకి ఆశపడి తమ రాజ్యాంగంలో క్రిమియాకి కల్పిస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి హోదాని రద్దు చేశాడు. అప్పటికే KGB లో గూడచారిగా పని చేసి తరువాత రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న వ్లాదిమిర్ పుతిన్ జరుగుతున్న పరిణామాలని నిశితంగా గమనిస్తూ ఉండేవాడు. 2000ల సంవత్సరం నాటికి రష్యా పార్లమెంటులో కీలక పదవిలోకి వచ్చాడు. తరువాత అధ్యక్షుడు అయ్యాడు. ఇచ్చిన మాటని తప్పిన ఉక్రెయిన్… అమెరికా,నాటో దేశాల మాట విని క్రిమియా స్వతంత్ర హోదాని రద్దు చేయడం జరిగింది. ఈ విషయంలో పుతిన్ ఉక్రెయిన్ మీద ఆగ్రహంతో ఉండేవాడు. అయితే అప్పటికి రష్యా పారిశ్రామికంగా,ఆర్ధికంగా ఇంకా పూర్తిగా నిలదొక్కుకోలేదు.
అమెరికా,నాటో దేశాలు క్రిమియాని ముందు నాటోలో చేర్చుకొని అక్కడ తమ F-22 లతో పాటు ICBM లని పెట్టాలనే ఆలోచనలో ఉన్నాయి. దాని కోసమే ఉక్రెయిన్ చేత స్వతంత్ర హోదాని రద్దు చేయించాయి. అంటే ముందు క్రిమియాని నాటో లో చేర్చుకొని తరువాత మెల్లగా ఉక్రెయిన్ ని కూడా నాటో లో భాగంగా చేర్చుకుంటాము అని హామీ ఇచ్చాయి. ఇక్కడే తిరకాసు ఉంది.
1. నాటో రూల్స్ ప్రకారం నాటోలో ఏ దేశం అన్నా చేరాలి అంటే ముందు ఆ దేశానికి ఎలాంటి సరిహద్దు వివాదం ఉండకూడదు అనే నిబంధన ఉంది. క్రిమియా ద్వీపకల్పంకి అటు రష్యాతో కానీ ఇటు ఉక్రెయిన్ తో కానీ ఎలాంటి సరిహద్దు వివాదం లేదు కాబట్టి క్రిమియాని నాటోలో చేర్చుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది.
2. ఉక్రెయిన్ ని నాటో లో చేర్చుకోవాలంటే దానికి ఇతర దేశాలతో సరిహద్దు వివాదాలు ఉండకూడదు. రష్యాతో సరిహద్దు వివాదం ఉంది? మరి ఉక్రెయిన్ ఎలా నమ్మింది ? అంటే ఉక్రెయిన్ కోసం నాటో తన రూల్స్ ని మారుస్తుందా? ప్రశ్నే లేదు ఎందుకంటే మిగతా దేశాల సంగతి పక్కన పెడితే జెర్మనీ అసలు ఒప్పుకోదు అలాగే ఫ్రాన్స్ కూడా ఒప్పుకోదు.
3. ఇవన్నీ తెలిసీ ఉక్రెయిన్ అధ్యక్షులు తమ ప్రజలని మోసం చేస్తూ వచ్చారు. ఆ మాటకొస్తే ఉక్రెయిన్ లో మొదటి నుండి అవినీతి చాల ఎక్కువ అలా అని రష్యాలో తక్కువ ఉంది అని కాదు. ఉక్రెయిన్ లో ఉన్న మొదటి 100 మంది బిలియనీర్లు ఎవరికీ కూడా ఉక్రెయిన్ లో చెప్పుకోతగ్గ ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ లేవు.. అదే సమయంలో వీళ్ళ పెట్టుబడులు యూరోపు,అమెరికా దేశాలలో ఉన్నాయి. తమ అవినీతి వందల కోట్ల డాలర్ల సంపాదనను అలాగే ఉక్రెయిన్ లో దాస్తే ఎప్పటికయినా ప్రమాదం అని ముందు జాగ్రత్తగా అమెరికా,యూరోపులో పెట్టుబడులు పెట్టి విలాసవంతమయిన ఇళ్ళు కొనుక్కున్నారు.
4. ఉక్రెయిన్ అధ్యక్షులు అందరూ అమెరికా,నాటో దేశాల మాటలు నమ్మి తమ స్వంత రక్షణ పరిశ్రమలని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. పాత సోవియట్ కాలం నాటి పరిశ్రమలలో కేవలం T-80 యుద్ధ టాంకులు తయారుచేసే పరిశ్రమ మాత్రం నిలబెట్టుకోగాలిగారు. అదే సమయంలో ఉక్రెయిన్ లోని డిఫెన్స్ కి సంబంధించిన ఇంజనీర్లు యూరపు,అమెరికా,చైనా దేశాలకి వెళ్ళిపోయారు. మరీ ముఖ్యంగా చైనా ఈ రోజు ఇంతలా డిఫెన్స్ కి సంబంధించి అభివృద్ధి సాధించటంలో ప్రధాన పాత్ర పోషించింది ఉక్రెయిన్ ఇంజినీర్లు. ఉక్రెయిన్ ఇంజినీర్లు చైనా వెళ్లకపోయి ఉంటె ఇప్పుడున్న స్థితిలో ఉండేది కాదు. 1991 లో చాల మంది డిఫెన్స్ ఇంజినీర్లు భారతదేశంలో పనిచేయడానికి ఇష్టపడ్డారు. అప్పట్లో మన దగ్గర ఉన్న బంగారాన్ని లండన్ ట్రెజరీ లో తాకట్టు పెట్టి డాలర్లు అప్పు తెచ్చుకొని క్రూడ్ ఆయిల్ బిల్లులు చెల్లించే దుర్భర పరిస్థితిలో ఉన్నాం. చైనా అప్పటికే బలం పుంజుకుంటున్నది పైగా ముందు చూపుతో ఉక్రెయిన్ ఇంజినీర్ల ని ఆహ్వానించి వాళ్లకి మంచి జీతాలు ఇచ్చి వెనక్కి పోకుండా కాపాడుకొంది.
5. ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి హయాంలో ఇండియా అణుపరీక్ష జరిపినప్పుడు అమెరికా ఐక్యరాజ్యసమితిలో మన మీద ఆంక్షలు విధించడానికి అంటూ తీర్మానం పెడితే ఉక్రెయిన్ ప్రతినిధి బలంగా దానిని సమర్ధించాడు.
6. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ మీద ఎప్పుడు చర్చ జరిగినా పాకిస్థాన్ కి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఉక్రెయిన్ ప్రతినిధులు. దీని మీద భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా లెక్క చేయలేదు ఉక్రెయిన్. కానీ రష్యా మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా వోటు వేసేది.
7. పాకిస్థాన్ రష్యా ని T-90 మెయిన్ యుద్ధ టాంక్ లు అమ్మమని అడిగితె పుతిన్ ఒప్పుకోలేదు. దాంతో పాకిస్థాన్ ఉక్రెయిన్ ని అడగగానే వెంటనే తన T-80 MBT లు అమ్మడానికి ఒప్పుకుంది. 100 యుద్ధ T-80 లని అమ్మింది.అప్పుడు కూడా భారత్ అభ్యంతరం చెపితే లెక్కచేయలేదు. మళ్ళీ అవే యుద్ధ టాంక్ లని ఆధునీకరించడానికి ఒప్పందం చేసుకుంటుంటే మళ్ళీ భారత్ అభ్యంతరం చెప్పిన్న బేఖాతరు చేసిన ఉక్రెయిన్ కాంట్రాక్ట్ మీద సంతకాలు పెట్టింది. అమెరికా,నాటో ఎలా చెప్తే అలా ఆడింది ఉక్రెయిన్.
రాజకీయ వ్యవహారాల్లో ఉక్రెయిన్ ప్రజలని నిందించాల్సిన అవసరం లేదు. తమ దేశ ప్రజల ప్రయోజనాలని తాకట్టుపెట్టి భారత్ కి వ్యతిరేకంగా పనిచేసిన అవినీతి పరులయిన ఉక్రెయిన్ రాజకీయ నాయకుల తీరును ఎందగాట్టాల్సిందే.
2014 లో రష్యా క్రిమియాని స్వాధీనం చేసుకున్నప్పుడు…కళ్ళు తెరిచి నాటో అమెరికా కూటమి నుండి బయటపడి రష్యాతో సఖ్యతగా ఉంటె ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదు. నేను స్వయంగా ఆయుధం పట్టుకొని యుద్ధ రంగంలో దిగుతున్నాను అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నమాట వింటే ఎవరికీ అయినా జాలి కలుగకమానదు. చివరికి ప్రపంచం మొత్తం మమ్మల్ని ఒంటరిని చేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు. వారం క్రితం కూడా అమెరికా,నాటో దేశాలని చూపిస్తూ తీవ్ర చర్యలకి సిద్ధంగా ఉండాలి అంటూ పుతిన్ కి హెచ్చరిక చేసిన అధ్యక్షుడేనా నిన్న కన్నీళ్లు పెట్టుకుంటూ తమ పౌరులని కూడా ఆయుధాలు పట్టుకొని రష్యాని ఎదిరించండి అంటూ ఏడ్చింది ?
వీళ్ళకి చచ్చే దాకా తెలివిరాదా ? వారం క్రితం నాటో ఒక ప్రకటన చేసింది. దాని సారాంశం ఏమిటంటే : రష్యా సైనికులు ఎవరయినా సరే ,ఎంతమంది అయినా సరే మీ ఆయుధాలు పక్కనపెట్టేసి యూరోపులోకి వస్తే మీకు పౌరసత్వం ఇస్తాము మీరు ఇక్కడ హాయిగా జీవించవచ్చు అంటూ ఆశ పెట్టినప్పుడు అయినా ఉక్రెయిన్ రాజకీయ నాయకత్వానికి అర్ధమయి ఉండాలి కదా ? నాటో మనకి సైనిక సహాయం చేయదని ?
యుద్దానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా విదేశాంగ మంత్రితో మాట్లాడినప్పుడు ఒకే ఒక్క హామీ అడిగాడు. అమెరికా కానీ నాటో కానీ ఉక్రెయిన్ ని తమతో కలుపుకోము అని హామీ ఇస్తే నేను వెనక్కి వెళ్లిపోతాను అని. బ్లింకెన్ అలాంటి హామీ మేము ఇవ్వలేము అని తెగేసి చెప్పాడు. చర్చలు పేరుతొ కాలయాపన కాదు నాకు హామీ ఇస్తే చాలు అని సంవత్సరకాలంగా పుతిన్ అడుగుతూనే ఉన్నాడు. EU, అమెరికా ఎలాంటి హామీ ఇవ్వలేకపోయాయి. అంటే ఉక్రెయిన్ దేశాన్ని ఎదో ఒక రోజున తమలో కలుపుకోవాలి అనే దురాలోచన ఉన్నట్లేగా ?
పుతిన్ యువకుడిగా ఉన్నప్పుడు సోవియట్ విచ్చిన్నం దాని ఫలితాలని దగ్గరగా చూశాడు. 30 ఏళ్ళు గడిచినా మళ్ళీ తమ దేశపు మహిళలు విదేశాలకి వెళ్లి వ్యభిచారం చేసి ఇంటికి డబ్బులు పంపే పరిస్థితి రాకూడదు. దానికోసం దేనికయినా సిద్ధంగా ఉన్నానంటూ చివరి హెచ్చరిక చేసి మరీ యుద్ధానికి సిద్ధపడ్డాడు.
ఇక ఇప్పటికే అమెరికా ఆంక్షల వలన ఎలా నెగ్గుకు రావాలో నేర్చుకున్నాడు ఇప్పుడు అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది అలాగే జపాన్,యూరోపియన్ యూనియన్ ,ఆస్ట్రేలియాలు కూడా రష్యా మీద ఆంక్షలు విధించాయి. అన్నీ ఆలోచించుకునే ఒక ప్లాన్ ప్రకారమే వెళుతున్నాడు పుతిన్.

Also Read : ఉక్రెయిన్ విషాదం

RELATED ARTICLES

Most Popular

న్యూస్