Tuesday, February 11, 2025
HomeTrending NewsSelfie Challenge: బాబుకు సీదిరి సెల్ఫీ ఛాలెంజ్

Selfie Challenge: బాబుకు సీదిరి సెల్ఫీ ఛాలెంజ్

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సెల్ఫీ చాలెంజ్ చేశారు.  ఉత్తరాంధ్రలో  మీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో, తాము ఏం చేశామో చూపిస్తానంటూ బాబుకు సవాల్ విసిరారు.  శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో 200 పడకలతో నిర్మాణమవుతోన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్  త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది.  అక్కడకు వెళ్లిన మంత్రి, జగన్ పేస్ మాస్క్ ధరించి కుర్చీలో కూర్చొని ఓ సెల్ఫీ దిగి బాబుకు ఛాలెంజ్ చేశారు.

జిల్లాలో పోర్టు నిర్మాణం, సాగు-తాగు నీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, నిన్న కూడా జిల్లాకు కోట్ల రూపాయల నిధులు జిల్లాకు మంజూరు చేశారని మంత్రి వెల్లడించారు. కిడ్నీ సెంటర్ ఇక్కడి ప్రజల దశాబ్దాల కల అన్ని, సిఎం జగన్ దాన్ని సాకారం చేస్తున్నారని మంత్రి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్