Saturday, April 20, 2024
HomeTrending Newsబద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డా. సుధ

బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డా. సుధ

బద్వేల్ ఉపఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య భార్య డా. సుధ పేరును సిఎం జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆమె పేరుని ప్రకటించారు. మరోవైపు తెలుగుదేశం తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజశేఖర్ నే టిడిపి మరోసారి బరిలోకి దింపనుంది.

వైఎస్సార్ కడప జిల్లాలో బద్వేల్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున  డా. వెంకట సుబ్బయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఓబులాపురం రాజశేఖర్ పై 44734 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  అనారోగ్యంతో బాధపడిన అయన 2021 మార్చ్ 28న కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు.

బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు అక్టోబర్ 30న జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 2 న కౌంటింగ్ జరగనుంది. ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది.  అక్టోబర్ 1 న నోటిఫికేషన్ విడుదల కానుంది, నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8…. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు,  ఫలితాల ప్రకటన ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్